సీఎం జగన్‌ను కలిసిన మాజీ న్యాయ‌మూర్తి ఈశ్వ‌ర‌య్య‌

అమ‌రావ‌తిః హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అఖిల భారత బీసీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్య శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి అభినందించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, పలువురు బీసీ నాయకులు కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఏపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేయడమే కాకుండా బలహీన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు బలహీన వర్గాలకు ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ తన కేబినెట్‌లో 60 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించారు. 

తాజా ఫోటోలు

Back to Top