ఘనంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ జెండాల‌ ఆవిష్క‌ర‌ణ‌, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు

అమరావతి:  రాష్ట్ర‌వ్యాప్తంగా  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవి­ర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. వేడుక‌ల్లో సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమా­ల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 

శాసనమండలి ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని వైయ‌స్ జగన్ అంటున్నారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు. తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు. ప్రజా అవసరాల మీదనే వైయ‌స్ జగన్ పాదయాత్ర చేశారు. వైయ‌స్ జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదన్నారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు వైయ‌స్ జగన్. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు. 

రాష్ర్ట మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించటం వైయ‌స్ జగన్‌కే సాధ్యం.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్‌ని ఓడించి తీరుతాం. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం. అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు. వారికి అండగా నిలవాలంటే మళ్లీ వైయ‌స్ జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు.ఎంతమంది కల్సి వచ్చినా జగన్ ని ఏమి చేయలేరు  అని జోగి రమేష్ అన్నారు.

 శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 175 స్దానాలను అదే విధంగా 25 పార్లమెంట్ స్దానాలను గెలుచుకుని తీరలన్నారు. ఇందుకు కార్యకర్తలందరూ ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు.సీఎం వైయ‌స్ జగన్ అంటేనే విశ్వసనీయత. చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత వైయ‌స్ జగన్‌ది అని కొనియాడారు.నాడు-నేడు ద్వారా అటు విద్య,వైద్యం విషయంలో వేల కోట్ల రూపాయలు ఖర్చుతో పేదలకు అనేక సదుపాయాలు కల్పించారన్నారు.పేద వారి పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్య ద్వారా ప్రపంచస్దాయి విద్యార్దులను తయారుచేస్తున్నారన్నారు.తల్లులకు అమ్మవడితోపాటు అనేక సంక్షేమ పధకాలను పేదలు,ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీ ల అభివృధ్దికి అమలు చేస్తున్నారన్నారు.  

 ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ అనేక అవమానాలను పొందినా కూడా అనేక పోరాటాలు చేసి సుధీర్గ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై 14 సంవత్సరాలుగా పార్టీని దిగ్విజయంగా నడుపుతున్నారన్నారు.రాష్ర్టం అభివృద్ది చెందాలంటే జగన్ గారు మరిన్న సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎల్ ఏ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ మైనారిటీలకు రక్షణగా ఉండే పార్టీ వైయస్సార్ సిపి మాత్రమే అన్నారు.ప్రతి ముస్లిం మైనారిటీ కూాడా వైయస్సార్ సిపికి అండగా నిలవాలన్నారు. 

 శాసనమండలి సభ్యురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ జగన్ గారి పరిపాలన దేశంలో ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.నేడు అవినీతికి తావులేకుండా డిబిటి ద్వారా 2.65 లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందించారన్నారు.

కార్యక్రమం లో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి,స్కిల్ డెవలప్ మెంట్ సలహాదారులు చల్లా మధుసూధన రెడ్డి పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top