వరద సహాయక చర్యలు ముమ్మరం  

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

విజయవాడ: వరద సహాయక చర్యలను ముమ్మరం చేశామని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘కృష్ణా, గోదావరి నదులకి వరద ప్రచాహం వస్తోంది.  గత వందేళ్లలో జులై నెలలో ఇంతటి వరద రావడం ఇదే మొదటిసారి. ఊహకి అందని విధంగా వరదలు వచ్చాయి. నిర్వాసితులని వరద ప్రాంతాల నుంచి తరలించడానికి చర్యలు తీసుకున్నాం.

పోలవరం వద్ద గోదావరి 16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికిపుడు ఈ వరదలు తగ్గే పరిస్ధితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎ‌న్డీఆర్ఎఫ్ బృందాలకి ప్రజలు సహకరించాలి. మేకపాటి గౌతమ్ రెడ్డి, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను ఆగస్టు 15న సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించబోతున్నార‌ని అంబటి తెలిపారు.

ఇక పోలవరం ప్రాజెక్టుపై త్వరలోనే శ్వేతప్రతం విడుదల చేస్తామని, దశల వారీగా పోలవరం పూర్తి చేస్తామన్నారు అంబటి రాంబాబు. పోలవరం పనులతో పాటు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ను కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. 

Back to Top