అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు సీఎం చేయూత 

70 వేల మందికిపైగా ఆర్థికసాయం అందించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన అర్చకులు, పాస్టర్‌లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయూతనందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లాప్‌టాప్‌ బటన్‌ నొక్కి అర్చకులు, పాస్టర్‌లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు ఒక్కొక్కరికీ రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. 70 వేల మంది బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌కు పురోహితులు, పాస్టర్లు, ఇమామ్‌లు ఆశీర్వ‌చ‌నాలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజమ్‌లకు లబ్ధిచేకూరింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top