ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఔదార్యం

కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక‌సాయం

గుంటూరు:  మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఓ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోని త‌న ఔదార్యాన్ని చాటిచెప్పారు.  కిడ్ని వ్యాధితో బాధ‌ప‌డుతున్న కుటుంబానికి ఆస‌రాగా నిలిచి ఆర్థిక‌సాయం అంద‌జేశారు. మెల్లెంపూడి గ్రామానికి చెందిన‌ పఠాన్ సభియా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ..ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చ‌లించిపోయారు. ఆమె కుటుంబ‌ పోషణ నిమిత్తం రూ.20 వేల ఆర్థిక‌సాయాన్ని స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌తో ఇచ్చి పంపించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మున్నంగి వివేకానంద రెడ్డి, కత్తిక రాఘవరావు, వుయ్యూరు శివరామిరెడ్డి, బొమ్మరెడ్డి రాజా రామిరెడ్డి, ఈదులమూడి శేఖర్, కృష్ణా రెడ్డి, మొగల్ జలీల్, షేక్ అలంబుడె, నాగుల మీరా తదితరులు పాల్గొన్నారు.

Back to Top