నవరత్నాలు, పేద‌ల‌ సంక్షేమానికి పెద్దపీట

అసెంబ్లీలో 2022-23 వార్షిక‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

తిరువళ్లువార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం 

2022–2023 ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.2,56,256 కోట్లు

మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు

రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతం

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంపు

కరోనా స‌మ‌యంలో వైయ‌స్‌ జగన్ నాయ‌క‌త్వంలో ప్రభుత్వం సమర్థవంతం ప‌నిచేసింది

సంక్షేమ ప‌థ‌కాల‌ ఫలాలను ప్రజలకు అందించింది

అసెంబ్లీ: ``గొప్ప పాలకులు అనబడేవారు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మపథం, న్యాయ మార్గాల నుంచి వైదొలగరు. ఆత్మగౌరవంతో, దయతో కూడిన ధైర్యంతో ముందుకుసాగుతారు`` అని ప్ర‌ఖ్యాత‌ క‌వి తిరువ‌ళ్లువార్ సూక్తుల‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. అసెంబ్లీలో 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ‌పెట్టారు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన పలు నివేదికల్లో ఏపీకి దక్కిన ఘనత గురించి వివరించారు. సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు చేయడం.. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. కరోనాలాంటి మహమ్మారిని ఎదుర్కొంటూ.. వైయ‌స్‌ జగన్ నాయ‌క‌త్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని మంత్రి బుగ్గన గుర్తుచేశారు.

2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లుగా పేర్కొన్న మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం రూ. 47, 996 కోట్లు,  రెవెన్యూ లోటు రూ. 17, 036 కోట్లు,  ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్‌లో పొందుపర్చారు.

బ‌డ్జెట్‌పై అసెంబ్లీలో మంత్రి బుగ్గ‌న ఏం మాట్లాడారంటే..
ఈ వాక్యాలు శతాబ్దాల అనంతరం ఒక్కసారిగా వచ్చిన విపత్తును ఎదుర్కొనే విషయంలో మన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కోవిడ్‌ మహమ్మారి పరిణామాల నుంచి బయటపడే క్రమంలో మన ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో నడిపించడం ద్వారా మరింత విజ్ఞతను ప్రదర్శిస్తుంది. అభివృద్ధి, విధాన రూపకల్పనలో మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, జీవనోపాధికి, మద్దతు, సామాజిక భద్రత అనే నాలుగు మూలస్తంభాలపై ఆర్థిక శాస్త్ర ప్రామాణిక నమూనాలు దృష్టిసారిస్తాయి. ఈనాలుగే అమలు పరచగలిగే విధానాలు. ఇవి సుపరిపాలనతో కలిపి స్థిరమైన ఆర్థిక వృద్ధికి ఆధారం కల్పిస్తున్నాయి. ఇందులోని అంతర్లీన సూత్రం ఏంటంటే.. పౌరులు తమ అంతర్గత సామర్థ్యాన్ని గ్రహించే అవకాశాలను ఈ నాలుగు మూల స్తంభాలు కల్పిస్తున్నాయి. 

ఈ నాలుగు మూల స్తంభాలు తూర్పు ఆసియాలోని అధిక పనితీరు గల ఆర్థిక వ్యవస్థలతో సహా నేడు అన్ని అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి మార్గాలకు ఆధారం. 2016 నాటి ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే (ఎస్‌డీజీ), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల వంటి సంస్థల యొక్క ఇతర నివేదికలు కూడా ఈ మూల స్తంభాలపై ఆధారపడి ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధి పునాదులను నిర్మించడానికి మన ప్రభుత్వం నాలుగు మూలస్తంభాల విధానాన్ని స్వీకరించింది. రాష్ట్ర ప్రజలందరి జీవితాలను, జీవనోపాధిని నిర్మించుకోవడానికి సమాన అవకాశాలను అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ప్రభుత్వం యొక్క అన్ని విధానాలను ఈ నమూనాను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడ్డాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.. నవరత్నాల ఏకీకరణ
ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 ఎస్‌డీజీలను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు  రూపొందించబడ్డాయి. ఇందువల్ల మన రాష్ట్రం వివిధ అభివృద్ధి సూచికలతో స్థిరమైన పెరుగదలను చూడగలిగింది. నీతి అయోగ్, ఎస్‌డీజీ ఇండియా 2020–21 నివేదిక ప్రకారం.. పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం, సముద్ర జల జీవుల పరిరక్షణలో మన రాష్ట్రం మొదటి ఐదు స్థానాల్లో ఉంది. 

ఎస్‌డీజీల విస్తృతమైన నమూనాను కలిగి ఉన్నాయని మన ప్రభుత్వం గుర్తించింది. అంతేకాకుండా అట్టడుగు వర్గాల భాగస్వామ్యం, సమాజ వికాసం లేకుండా ఎస్‌డీజీలను సాధించవచ్చని అనుకోవడం అసాధ్యం. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల నెట్‌వర్క్, రైతు భరోసా కేంద్రాలు వంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం, విద్యా, ఆరోగ్య వ్యవస్థల భారీ ఆధునీకరణ, మహిళా స్వయం సహాయక సంఘాలను ఇంతకుముందు కంటే అధికంగా బలోపేతం చేయడం ఈ పనితీరుకు గల కారణాలు. 

వికేంద్రీకృత పాలనపై సమగ్ర దృష్టిని సారించడం ద్వారా క్లిష్టమైన ఎస్‌డీజీల సూచికల్లో కూడా మన ప్రభుత్వం అద్భతమైన పనితీరు సాధించగలిగింది. నీతి అయోగ్‌ తన ఎస్‌డీజీ నివేదికల్లో ఎస్‌డీజీలను అవుట్‌ కమ్‌ బడ్జెట్‌ స్టేట్‌మెంట్‌ నమూనా ఓబీఎస్‌తో అనుసంధానం చేయాలని సిఫార్సు చేసింది. నిర్దిష్టమైన సమయంలో ఈ ప్రమాణాలను సిద్ధం చేసుకోవడం, పర్యవేక్షించడం, ముదింపు చేయడం కోసం ఎస్‌డీజీలను అవుట్‌ కమ్‌ బడ్జెట్‌ స్టేట్‌మెంట్తో ఏకీకృతం చేయడంలో మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

మానవ సామర్థ్య అభివృద్ధి..
పేదరికం, ఆకలి నిర్మూలన. మంచి ఆరోగ్యం, శ్రేయస్సును సాధించడం, నాణ్యమైన విద్య కలిగి ఉండటం, లింగ సమానత్వం సాధించామనే ఎస్‌డీజీలను మొదటి అభివృద్ధి మూలస్తంభమైన మానవ సామర్థ్య అభివృద్ధి కలిగి ఉంటుంది. 

విద్య, ఆరోగ్య మన ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత. నాడు–నేడు వంటి మన ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా, ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి సందేహం లేదు. జగనన్న అమ్మఒడి, గోరుముద్దు, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైద్య కళాశాలు, వైయస్‌ఆర్‌ వైద్య శాలలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాలు మానవ సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర మానవ వనరుల నాణ్యతను మెరుగుపర్చడానికి, అత్యున్నతతో నాణ్యతతో కూడిన విద్యా, ఆరోగ్య, పోషకాహార సేవలను ప్రతి ఒక్కరికీ అందించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈ కార్యక్రమాల విజయం ద్వారా నీతి అయోగ్‌ యొక్క బహుళ పేదరిక నివేదికలో ఎంపీఐలో మన రాష్ట్రం ఉన్నతస్థాయిలో నిలిచింది. 

నీతి అయోగ్‌ యొక్క 2021 ఎస్‌డీజీల నివేదిక ప్రకారం పేదరికం తగ్గింపులో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మన రాష్ట్రంలో శిశు, కౌమార దశల్లోని పిల్లల మరణాలు 2 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. బాలింతల ఆరోగ్య రక్షణలో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. విద్యలో కూడా మన పాఠశాల హాజరును 98 శాతం కంటే ఎక్కువగా సాధించాం. స్థూల నమోదు నిష్పత్తి రేటు కూడా షెడ్యూల్డ్‌ కులాల విషయంలో 7.5 శాతం గానూ, షెడ్యూల్డ్‌ తెగల విషయంలో 9.5 శాతం, బాలిక విషయంలో 11.03 శాతం పెరిగి జాతీయ పెరుగుదల రేటును అధిగమించింది. 

మౌలిక సదుపాయల అభివృద్ధి..
స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, సరసమైన, స్వచ్ఛమైన ఎనర్జీ శక్తిని అందుబాటులో ఉంచడం, స్థిరమైన నగరాలు, సంఘాలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లాంటి ఎస్‌డీజీలు రెండో మూల స్తంభాలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కిందకే వస్తాయి. నాడు–నేడు కార్యక్రమాలు, కొత్త వైద్య కళాశాలలు, వైయస్‌ఆర్‌ జలయజ్ఞం, వైయస్‌ఆర్‌ జలకళ, కొత్త ఓడరేవులు, రహదారుల అభివృద్ధి, నౌకాశ్రాయాల ఏర్పాటు, వ్యవసాయం, పాడి పారిశ్రమల్లో మార్కెట్‌ మరియు మౌలిక సదుపాయాల కల్పన, ఫైబర్‌ నెట్, పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా సమాజ ఆస్తులు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. 

జగనన్న కాలనీలు, వైయస్‌ఆర్‌ హౌసింగ్‌ వంటి కార్యక్రమాల ద్వారా అందరికీ ఇల్లు అందించడంపై మన ప్రభుత్వం దృష్టిసారించింది. నీతి అయోగ్‌ యొక్క 2021 బహుళ పేదరిక నివేదిక ప్రకారం గృహ సౌకర్యాలు కలిగిన జనాభా శాతం పరంగా మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. నాడు–నేడు కార్యక్రమాలను భారీ స్థాయిలో అమలు చేయడం ద్వారా అంగన్‌వాడీలు, ఆస్పత్రులు, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో చారిత్రక నిర్లక్ష్యాన్ని, తీవ్రమైన లోపాలను అధిగమించడానికి అవకాశం కల్పించింది. నీతి అయోగ్‌ ఎస్‌డీజీ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 100 శాతం కుటుంబాలకు విద్యుత్‌ అందించబడింది. అంతేకాకుండా వీరంతా శుభ్రమైన వంట నూనెలను కూడా ఉపయోగిస్తున్నారు. మన రాష్ట్రంలో 91 శాతం కంటే ఎక్కువగా పాఠశాలల్లో గల భవన ప్రాంగణాలు, తాగునీరు, విద్యుత్‌తో కూడిన ప్రాధమిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు కంటే ఇది 7 శాతం ఎక్కువ. ఆరోగ్యం విషయంలో 99.5 శాతం కంటే ఎక్కువ కాన్పులు సంస్థాగతమైనవే అని ప్రాధమిక, జిల్లా వైద్య కేంద్రాల్లో జరపబడినవే. అంతేకాకుండా మన రాష్ట్రంలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సహాయ సిబ్బందితో కూడా రెండవ అతిపెద్ద వైద్య సిబ్బందిని కలిగి ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇది మన ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పటిష్టతను చూపుతోంది. 

జీవనోపాధి..
మూడవ మూలస్తంభం అయిన జీవనోపాధి కల్పన అనేది సముచితమైన పని అని ఆర్థిక వృద్ధి అవకాశం కల్పించడం వంటి ఎస్‌డీజీలను కలిగి ఉంటుంది. జీవనోపాధిలో వ్యవసాయం, పాడి పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను మన ప్రభుత్వం గుర్తిస్తూ.. వెనకబడిన, పురోగామి అనుసంధానాలను ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాలను ఆమోదించి అమలు పరుస్తుంది. వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైయస్‌ఆర్‌ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, గోదాం, వైయస్‌ఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు, ప్రాథమిక, ద్వితీయ ప్రాసెసింగ్‌ సౌకర్యాలు, అధిక మొత్తంలో పాల శీతలీకరణ కేంద్రాలు, ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ వంటి వివిధ పథకాల ద్వారా 62 శాతం జనాభాకు జీవనోపాధి అందించే వ్యవసాయ రంగాన్ని మన ప్రభుత్వం సమగ్ర దృష్టితో అమలు చేస్తోంది. అమూల్‌తో భాగస్వామ్యం పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చిన అనుబంధ గ్రామీణ ఆదాయాలకు ముఖ్యమైన వనరుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. 

5వ ఎస్‌డీజీ అయిన లింగసమానత్వం తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంతో కూడిన చారిత్రాత్మక లింగఅసమానతలను సరిదిద్దాల్సిన ఆవశ్యకతలను సూచిస్తోంది. ఈ రెండింటినీ అనగా.. మహిళా సామాజిక ఆర్థిక సాధికారత, వ్యక్తిగత గౌరవంతో కూడిన కుటుంబ ఉన్నతిని తీసుకువస్తుందనే నమ్మకానికి మన ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉంది. మన ప్రభుత్వ వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత, స్వయం సహాయ బృందాల్లోని మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడంలో మూలధనాన్ని సమకూర్చడంలో ముందుంటాయి. తద్వారా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 35.5 శాతం కంటే తప్పకుండా పెంచుతాయి. 

చివరగా వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం, వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైయస్‌ఆర్‌ లా నేస్తం కార్యక్రమాలు నిర్దిష్ట వృత్తి వర్గాలకు జీవనోపాధిని అందిస్తాయి. 

డిజిటల్, రవాణా వ్యవస్థల అనుసంధానం ఆర్థిక వృద్ధికి పునాదిగా ఉంటుంది. భారత ప్రభుత్వ మద్దతుతో రహదారుల నిర్మాణం, గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లను అందుబాటులోకి తీసుకెళ్లడం కోసం మన ప్రభుత్వం భారీ కార్యక్రమాలను ప్రారంభించింది. 

సామాజిక భద్రత.
నాల్గవ చివరి మూలస్తంభం సామాజిక భద్రత. ఇది అసమానతలను తగ్గించడం, ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించడం అనే ఎస్‌డీజీలను కలిగి ఉంటుంది. చివరిమూలస్తంభం సామాజిక భద్రతలో భాగమైన వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద వివిధ అణగారిన, బలహీనవర్గాలను మన ప్రభుత్వం విస్తృతమైన సామాజిక భదత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాదాపు 61.74 లక్షల మంది పెన్షన్‌దారులకు నెలకు రూ.2500 చొప్పున అందిస్తోంది. వృద్ధాప్య, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, ఏఆర్‌టీ చికిత్స తీసుకునే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి అందించే అత్యంత ప్రగతిశీల భద్రతా కార్యక్రమం. అంతేకాకుండా వికలాంగులు, ట్రాన్స్‌జెండర్, డప్పు కళాకారులు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు గౌరవ ప్రదమైన జీవితానికి భరోసా ఇవ్వడానికి మెరుగైన పెన్షన్లను మన ప్రభుత్వం అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు, అభిజిత్‌ బెనర్జీ, ఎస్తెర్‌ డుఫ్లో వంటి ప్రఖ్యాత ఆర్థిక వేత్తలు సూచించిన విధంగానే కరోనా మహమ్మారి సమయంలో మన ప్రభుత్వం రాష్ట్ర పేదలకు నగదు బదిలీ అందించింది. నగదు బదిలీల విధానం అర్థవంతమైన ప్రభావాన్ని చూపేస్థాయిలో జరిగింది. అంతేకాకుండా ప్రజలు వారి జీవనోపాధిని కోల్పోయే సమయంలో మరింత పేదరికంలోకి వెళ్లిపోకుండా ఈ పథకం నిరోధించ గలిగింది. 

రాష్ట్రంలో నాలుగు మూలస్తంభాల అమలు.. 
నాలుగు మూల స్తంభాల లక్ష్యసాధనకు వివిధ పథకాలను అందజేయడం, సుపరిపాలన అందించడం ద్వారా మన ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా మనవ వనరుల కొరతను వివిధ శాఖలు ఎదుర్కొంటున్నాయి. మన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ విడుదల చేయడం, పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నియామకం చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఇటీవల ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ సేవా పోర్టల్‌ 2.0 ద్వారా పాలనను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ప్రత్యేకస్థానం పొందింది. మన ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వార్షిక క్యాలెండర్‌ ఆధారంగా ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీపై దృష్టిసారించింది. 

వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను సకాలంలో అందజేయడంలో, లోటుపాట్లను తొలగిస్తుంది. జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తూ సామాజిక అభివృద్ధి, ఇళ్లలో వారికి కీలక పాత్రను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాలను బాలికలు, మహిళలను ప్రాధాన్యత ఇవ్వడానికి లక్ష్యంగా చేసుకొని రూపొందించడం జరిగింది. చివరగా.. నిబద్ధత, విశ్వసనీయత, పారదర్శకత, విశ్వాసం అనే  లక్షణాల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి, సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తూ ఆర్థిక వృద్ధి చెందే దిశగా మన ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కోవిడ్‌ –19 మహమ్మారి కారణంగా ఏర్పడిన భారీ ప్రతికూలతతోనూ కూడా దిగ్భ్రాంతిని అధిగమించడానికి మన రాష్ట్ర ఈ విధానాల అమలు ఎంతగానో సహాయపడింది. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృడమైన నాయకత్వంలో కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి, బడుగు, బలహీన వర్గాల జీవితాలు, జీవనోపాధిని రక్షించడానికి మన ప్రభుత్వం అనేక అత్యవసర చర్యలు చేపట్టింది. కోవిడ్‌ సమయంలో సీఎం వైయస్‌ జగన్‌ తరచూ సమీక్షలు జరిపారు. సీఎం వైయస్‌ జగన్‌ నిర్విరామ కృషికి సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా రాష్ట్రంలో ఎంతోమంది హెల్త్‌ డిపార్టుమెంట్, పబ్లిక్‌ హెల్త్, పోలీస్, రెవెన్యూ డిపార్టుమెంట్లు వారందరికీ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్, ప్రజారోగ్యం, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది కృషి వల్ల ఈ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోగలిగాం. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం మన రాష్ట్రం దాదాపు 8.05 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్ర ప్రజలకు అందించింది. ఈ సంఖ్య రాష్ట్ర ప్రజలకంటే రెట్టింపు. లాక్‌డౌన్‌ ఇతర అంతరాయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్ర ప్రజలకు విస్తృతమైన ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నగదు ప్రయోజనాలను అందించగలిగింది. 

నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో సూచించిన పథకాల ద్వారా ఎస్‌డీజీలు సాధించాలనే తపన, అలుపెరగని కృషిని మన రాష్ట్రాన్ని శ్రేయస్సు మార్గంలో ఉంచాయి. సీఎం వైయస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పట్ల చూపుతున్న తపన రాష్ట్రంలోని ప్రతిఒక్క పౌరుడి జీవితాన్ని మెరుగుపరిచే దిశగా కొనసాగుతోంది. 

ఎవరైతే ఒక సంకల్పానికి ముందు ధృడ నిబద్ధతను కలిగి ఉంటారో.. ఎవరైతే అవిశ్రాంతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో.. ఎవరైతే తమ విలువైన సమయాన్ని వృథా చేయరో.. ఆ వ్యక్తి మనసు మీద నియంత్రణ కలిగి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 

బ‌డ్జెట్ కేటాయింపులు ఇలా..

 • వ్యవసాయం రూ.69,306 కోట్లు కేటాయింపులు
 • వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖలకు రూ.11,387.69 కోట్లు
 • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630 కోట్లు
 • రైతులకు విత్తన సరఫరా రూ.200 కోట్లు
 • జీరో బెస్డ్‌ వ్యవసాయం రూ.87.27 కోట్లు
 • అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ రూ.50 కోట్లు
 • ధరల స్థిరీకరణ నిధి రూ.500 కోట్లు(మొత్తం నిధి రూ.30 వేల కోట్లు)
 • వైయస్‌ఆర్‌ రైతు భరోసా రూ.3,900 కోట్లు
 • రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు
 • వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా రూ.1802.04 కోట్లు
 • ప్రకృతి వైపరీత్యాల నిధి రూ.2,000 కోట్లు
 • రాష్ట్రీయ‌ కృషి వికాస్‌ యోజన రూ.1,750 కోట్లు 
 • వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక రూ.18,000 కోట్లు
 • ఆర్థిక సేవల రంగానికి రూ.69,306 కోట్లు
 • జగనన్న విద్యా కానుక రూ.2,500 కోట్లు
 • జగనన్న వసతి దీవెన రూ.2,083.32 కోట్లు
 • ఉన్నత విద్య–రూ.2,014.30 కోట్లు 
 • సెకండరీ ఎడ్యుకేషన్‌–రూ.27,706.66 కోట్లు
 • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.10,201.60 కోట్లు
 • డ్వాక్రా (రూరల్‌) వైయస్‌ఆర్‌ వడ్డీ లేని రుణాలు రూ.600 కోట్లు
 • డ్వాక్రా (అర్బన్‌) వైయస్‌ఆర్‌ వడ్డీ లేని రుణాలు రూ.200 కోట్లు
 • పర్యావరణ, అటవీ శాఖకు రూ.685.36 కోట్లు
 • విద్యుత్‌ రూ.10,281.04 కోట్లు
 • పౌర సరఫరాలు– రూ.3,719.24 కోట్లు కేటాయింపులు
 • పశు సంవర్ధకం–రూ.1,568.83 కోట్లు
 • బీసీ సంక్షేమం రూ.20,962.06 కోట్లు
 • ఇరిగేషన్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ రూ.11,482 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి రూ.17,109 కోట్లు
 • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–రూ.685 కోట్లు
 • ట్రాన్స్‌పోర్ట్‌–రూ.9,617 కోట్లు
 • ఇందన రంగానికి రూ.10,281 కోట్లు
 • జనరల్‌ ఎకో సర్వీసెస్‌–రూ.4,420 కోట్లు
 • ఇండస్ట్రీ అండ్‌ మినరల్స్‌–రూ.2,755.17 కోట్లు
 • వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ.20,962 కోట్లు
 • పాల ఉత్పత్తి, పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖకు రూ.1,568 కోట్లు
 • అమ్మ ఒడి రూ.6,500 కోట్లు కేటాయింపు
 • వైయస్‌ఆర్‌ చేయూత రూ.4,325 కోట్లు
 • నేతన్న నేస్తం రూ.199.99 కోట్లు
 • వైయస్‌ఆర్‌ ఆసరా రూ.6,400 కోట్లు
 • ఈబీసీ నేస్తం రూ.590 కోట్లు 
 • వైయస్‌ఆర్‌ కాపు నేస్తం రూ.500 కోట్లు
 • కాపుల సంక్షేమం రూ.3,531.68 కోట్లు
 • మైనారిటీల సంక్షేమం రూ.1,750.50 కోట్లు
 • క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ రూ.11.34 కోట్లు
 • బ్రాహ్మణ కార్పొరేషన్‌ రూ.455.23 కోట్లు 
 • జగనన్న చేదోడు రూ.300 కోట్లు
 • జగనన్న తోడు రూ.20 కోట్లు
 • వైయస్‌ఆర్‌ వాహన మిత్ర రూ.260 కోట్లు
 • మత్స్యకార భరోసా రూ.120.49 కోట్లు
 • మత్స్యకారుల డీజిల్‌ సబ్సిడీ రూ.50 కోట్లు
 • ఎస్సీ సబ్‌ప్లాన్‌ రూ.18,518 కోట్లు
 • ఎస్టీ సబ్‌ ప్లాన్‌–రూ.6,145 కోట్లు
 • బీసీ సబ్‌ ప్లాన్‌ రూ.29,143 కోట్లు
 • మైనారిటీ యాక్షన్‌ ప్లాన్‌ రూ.3,532 కోట్లు
 • ఈబీసీ సంక్షేమం రూ.6,639 కోట్లు 
 • వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ రూ.2,000 కోట్లు
 • వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా రూ.300 కోట్లు
 • ఆసుపత్రుల్లో నాడు–నేడు రూ.1,603 కోట్లు
 • నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ రూ.2,462.03 కోట్లు
 • మెడికల్‌ కాలేజీల్లో పనుల కోసం రూ.753.84 కోట్లు
 • కొత్త మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల కోసం రూ.320 కోట్లు 
 • ట్రైబల్‌ ఏరియాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.170 కోట్లు
 • 104 సర్వీసుల కోసం రూ.140 కోట్లు 
 • 108 కోసం రూ.133.19 కోట్లు
 • ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీట్ల పెంపు కోసం రూ.100 కోట్లు
 • ఎన్‌హెచ్‌ఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం రూ.695.88 కోట్లు 
 • అంగన్ వాడీల కోసం రూ. 1517.64 కోట్లు
 • సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం రూ.450 కోట్లు
 • ఎస్సీ పారిశ్రామికవేత్తల ఇన్సెంటివ్‌ల కోసం రూ.175 కోట్లు
 • ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్సింటివ్‌లు రూ.60 కోట్లు
 • ఇండస్ట్రియల్  ప్రమోషన్‌కు ఇన్సెంటివ్‌లు రూ.411.62 కోట్లు
 • అంగన్ వాడీల కోసం రూ. 1517.64 కోట్లు
 • విశాఖ చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌క రూ.236.86 కోట్లు
 • వైఎస్ఆర్‌ బీమా రూ.372.12 కోట్లు
 • అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం రూ. 1200 కోట్లు
 • సంపూర్ణ పోషణ కార్యక్రమాల కోసం రూ.330 కోట్లు
 • సంపూర్ణ పోషణ ప్లస్ రూ.201.82 కోట్లు
 • ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్స్ - రూ.218 కోట్లు
 • పీఎం ఆయుష్మాన్‌ భారత్ హెల్త్‌ ఇన్‌ప్రాస్ట్రక్షర్‌ మిషన్‌ రూ.250 కోట్లు
 • ఆశా వర్కర్ల గౌరవ వేతనంః రూ. 343.97 కోట్లు
 •  ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ఃరూ. 218 కోట్లు
 • రేషన్ బియ్యం కోసం రూ. 3,100 కోట్లు
 • బియ్యం డోర్‌ డెలివరీ కోసం రూ. 200.02 కోట్లు
 • పట్టణాభివృద్ధి - రూ.8,796 కోట్లు
 • తాగునీటి , పారిశుద్ధ్యం రూ.2,133.63 కోట్లు
 • గ్రామీణ తాగునీటి సరఫరా  కోసం రూ.1,149.93 కోట్లు
 • ఉపాధి హామీ పథకం కోసం రూ.5వేల కోట్ల కేటాయింపు
 • నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ రూ.389.06 కోట్లు
 • స్వచ్ఛ భారత్ కోసం రూ.500 కోట్లు
 • అర్చకుల కోసం రూ.122 కోట్లు
   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top