కృష్ణా జిల్లా పంద్రాగస్టు వేడుకల్లో సీఎం వైయస్‌ జగన్‌

ఆయా జిల్లాల్లో జెండా వందనం చేయనున్న మంత్రులు

అమరావతి : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లాలో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారు. ఆయా జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారైంది. శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్టణంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, నెల్లూరులో హోం మంత్రి సుచరిత, కర్నూల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి జెండా వందనం సమర్పించనున్నారు.
 
 

Back to Top