32 లక్షల ఇళ్ళు నిర్మించే మహాయజ్ఞాన్ని వైయ‌స్‌ జగన్ చేపట్టాడు..

 దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగని అద్భుతం ఇది..

 వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 

ఉరవకొండ:  "నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు" పథకం ద్వారా రాష్ట్రంలో పేదలకు 32 లక్షల ఇళ్ళు నిర్మించే మహాయజ్ఞాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చేపట్టాడని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నిరుపేదలకు స్థిరాస్తిని అందించే ఈమహాయజ్ఞంతో రాష్ట్ర చరిత్రలో వైయ‌స్  జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉరవకొండ రాయంపల్లి రాస్తా వద్ద నున్న వైయ‌స్ఆర్‌ జగనన్న కాలనీ' లే అవుట్లలో నూతనంగా వేసిన బోర్ వెల్ ను సర్పంచ్ లలిత,ఉప సర్పంచి వన్నప్ప, ఎంపీపీ చందా చంద్రమ్మ, హౌసింగ్ ఈఈ వెంకటదాసు, తహశీల్దార్ మునివేలు, ఎంపిడిఓ దామోదర్ రెడ్డి, విద్యుత్ డిఈ శేఖర్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ అంజుమాన్ సప్రిన్ తదితరులతో కలిసి నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఉరవకొండ మండల పరిధిలోని అన్ని లే అవుట్‌లను సందర్శించిమౌలిక వసతులు కల్పన పూర్తి చేసి వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్సార్, జగనన్న కాలనీలు అన్ని వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. మోడల్‌ గ్రామాలు, కాలనీలుగా నిలిపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.ప్రతి లే అవుట్‌లో తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సూచించిన విధంగా పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 వేల ఇళ్ళ నిర్మాణాలు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణల కోసం పునాది దశలోనే 10 నుంచి 15 వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లబ్ధిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఇసుక సమస్యను కూడా తీర్చామని ఎక్కడికక్కడ డంపులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో నియోజకవర్గంలో 24 వేల ఇల్లు నిర్మించే మహాత్బాగ్యం తనకు దక్కిందని ప్రజలకు ఇంతకంటే పెద్ద సేవ చేసే అవకాశం మంచి అవకాశం వేరే ఏది లేదన్నారు.దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఎంత ఇబ్బందైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేవిదంగా చర్యలు చేపడతామన్నారు.అధికారులు కూడా మెరుగైన పనితీరు కనపరుస్తున్నారని మరింతగా కష్టపడి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని కోరారు. అధికారులు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేశామని చెప్పారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు 

Back to Top