ప్రతి కష్టంలోనూ.. రైతన్నకు అండగా సీఎం వైయ‌స్‌ జగన్

 ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం దేశానికే ఆదర్శం

 వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

అనంత‌పురం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతు ప్రతి కష్టంలోను వెన్నంటే ఉన్నాడని అందుకే రైతు నష్ట పోకూడదని ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందిస్తున్నాడని ఉరవకొండ వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జమ చేశారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. 

రైతన్నల మీద ప్రభుత్వానికి ఉన్న  బాధ్యత, మమకారం, ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదని ప్రతి అడుగులో వారికి అండగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నారని అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.  ఏ సీజన్లో నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం అందిస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఏదైనా ఉందంటే అది వైయ‌స్ జ‌గ‌న్  ప్రభుత్వం ఒక్కటేనన్నారు.ఇది దేశానికే ఆదర్శమని ఆయన చెప్పారు. ఉరవకొండ నియోజకవర్గంలో  22 వేల 890 మంది రైతులకు గాను 77 వేల 674 ఎకరాల్లో పంట నష్టం కింద 31 కోట్ల 29 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఇదంతా తాము క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పర్యటించి నష్టాన్ని అత్యంత పారదర్శకంగా అంచనా వేయడం వల్లే సాధ్యమైందన్నారు.గత టీడీపీ ప్రభుత్వంలో అనేక మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టేసిందని ,కొద్దిమందికి మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తించిందన్నారు. ఇంకా అర్హత వుండి పరిహారం రాని రైతులు ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా పరిహారం అందే విదంగా చూస్తామని విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top