రాష్ట్రానికి జగన్‌ మేలు చేసి చూపిస్తారు..

విజయవాడ:తన తండ్రి ఆశయాల కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వైయస్‌ జగన్‌కు సీఎంగా ఒక అవకాశం ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ నేత జయసుధ కోరారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మహానేత వైయస్‌ఆర్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నేత జయసుధ అన్నారు.మళ్లీ వైయస్‌ఆర్‌సీపీలోకి రావడానికి కారణం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల ద్వారా  చాలా మంచిపనులు చేయవచ్చన్నారు.రాష్ట్ర ప్రజలకు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది.వైయస్‌  జగన్‌ను సీఎం చేయడమే సరైన నిర్ణయం అన్నారు.ప్రజల కోసం వైయస్‌ జగన్‌ ఎంతో కష్టపడుతున్నారన్నారు.ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, ధైర్యం కోల్పోకుండా వైయస్‌ జగన్‌ ప్రజల శ్రేయస్సు కోసం పాదయాత్ర చేశారన్నారు.

ప్రజలతో నిత్యం మమేకమవుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.ప్రజల కోసం వైయస్‌ జగన్‌ నవరత్నాలు ప్రవేశపెట్టారన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్,రైతులు,మహిళలు,యువత వంటి అనేక సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు.వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి అని అన్నారు.ఏపీ రాష్ట్ర ప్రజలకు వైయస్‌ జగన్‌ మేలు చేసి చూపిస్తారు.వైయస్‌ జగన్‌ ఒక అవకాశం ఇవ్వాలన్నారు.

 

Back to Top