నమ్మకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సీఎం వైయస్‌ జగన్‌

మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని 

చంద్రబాబును ప్రజలే కాదు పార్టీ క్యాడర్‌ కూడా వదిలేసింది

చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేరు

వైయస్‌ జగన్‌ నాలుగేళ్లలో 95 శాతం హామీలు అమలు చేశారు

చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు?

చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం. 

చంద్రబాబుకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి 

కేసీఆర్‌ను హరీష్‌రావు నేరుగా తిట్టలేక మాపై విమర్శలు

మాజీ మంత్రి పేర్ని నాని 

తాడేపల్లి:  నమ్మకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అయితే వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బంద‌ర్‌కు ఔటర్‌ రింగ్‌రోడ్డు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అన్నావ్‌.. తెచ్చావా?. బందరును హైదరాబాద్‌ మించిన సిటీ చేస్తానన్నావ్‌ చేశావా? అంటూ నిల‌దీశారు. బందరులో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేద‌ని పేర్ని నాని మండిపడ్డారు. త్వరలో సీఎం వైయ‌స్ జగన్‌ బందరు పోర్టు పనులు ప్రారంభిస్తారని, శరవేగంగా బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

 చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేర‌ని పేర్ని నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీరు-చెట్టు పథకంలో చంద్రబాబు రూ.2వేల కోట్లు కొట్టేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు దోచిపెట్టారు. చంద్రబాబు మళ్లీ తన పాలన తెస్తానని ప్రజలకు చెప్పగలరా?. జన్మభూమి కమిటీలను మళ్లీ ప్రవేశపెట్టగలరా?. తాను చేసిన ఒక్క మంచిపనైనా చెప్పగలరా?. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు?. పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.. బామ్మర్ధిలను తడిగుడ్డలతో గొంతకోసిన వాడు సైకో కాదా? అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

పేర్ని నాని ఏమ‌న్నారంటే..

 • చంద్రబాబును ప్రజలే కాదు పార్టీ క్యాడర్‌ కూడా వదిలేసింది
 • చంద్రబాబు సభలో ఖాళీ కుర్చీలు తప్ప జనం లేరు. ఖాళీ కుర్చీలతో గంటకుపైగా చంద్రబాబు మాట్లాడారు,
 • మచిలీ పట్నం వచ్చేందుకు చంద్రబాబుకు నైతిక అర్హత ఉందా?. 
 • బందర్‌కు చంద్రబాబు ఏం చేశారు
 • చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, అవాస్తవాలే
 • 2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు
 • వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఇవాళ మచిలీపట్నంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
 • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గోల్డ్‌ కవరింగ్‌ పరిశ్రమను వైయస్‌ జగన్‌ ఆదుకున్నారు. సబ్సిడీలో కరెంట్‌ ఇస్తున్నారు. 
 • నమ్మకానికి  వైయస్‌ జగన్‌ మారు పేరు..
 • వెన్నుపోటు, ద్రోహానికి మారు పేరు చంద్రబాబు 
 • చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేరు
 • నీరు–చెట్టు పథకంలో చంద్రబాబు రూ.2 వేల కోట్లు కొట్టేశారు
 • జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు దోచిపెట్టారు
 • వైయస్‌ జగన్‌ నాలుగేళ్లలో 95 శాతం హామీలు అమలు చేశారు
 • మే నుంచి బందర్‌ పోర్టు నిర్మాణ పనులు. శరవేగంగా బందర్‌ పోర్టు నిర్మానం పూర్తి చేస్తాం
 • ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం, అంటురోగం, శని చంద్రబాబే
 • చంద్రబాబు మళ్లీ తన పాలన తెస్తానని 2024 ఎన్నికల్లో ప్రజలకు చెప్పగలరా?
 • జన్మభూమి కమిటీలను మళ్లీ ప్రవేశపెట్టగలరా?
 • తాను చేసిన ఒక్క మంచి పనైనా చంద్రబాబు చెప్పగలరా?
 • రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు
 • గత నాలుగేళ్లలో మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ రూ.1 లక్షా 42 వేల కోట్ల నగదు బదిలీ చేశారు.
 • చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు?
 • పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
 • ఎన్టీఆర్‌ను మానసికంగా కుంగదీసిన చంద్రబాబు కదా సైకో అంటే..
 • బామ్మర్ధులను తడి గుడ్డలతో గొంతు కోసిన వాడు సైకో కాదా?
 • తోడల్లుడిని, తోడ బుట్టిన తమ్ముడిని నయ వంచన చేసిన వ్యక్తి చంద్రబాబు
 • నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
 • ఇన్ని అవలక్షణాలు ఉన్న చంద్రబాబే అసలైన సైకో
 • 2019లో చంద్రబాబును ప్రజలు బంగాళఖాతంలో కలిపారు. కృష్ణానదిలో ముంచి లేపారు.
 • 2023లో టీడీపీ కార్యకర్తలే బందర్‌లో ముంచేశారు. 
 • చంద్రబాబు నాపై చేసిన ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం. చంద్రబాబుకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి.
 • కేసీఆర్‌ తనను పట్టించుకోవడం లేదని హరీష్‌రావుకు కోపం. మామపై కడుపు రగిలిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హరీష్‌ ఆరోపణలు చేస్తాడు
 • మామ అల్లుళ్ల మధ్య ఉన్న తగాదాలే ఇలాంటి తప్పుడు ప్రకటనలకు నిదర్శనం
 • కేసీఆర్‌ను మాతో తిట్టించేందుకు హరీష్‌రావు మమ్మల్ని గిల్లుతుంటాడు
 • మాపైన ప్రేమ ఉంటే రాయలసీమ లిప్ట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు
 • నోటితో నవ్వుతూ..నొసళ్లతో వెక్కిరించే రకం హరీష్‌రావు..సారీ కేసీఆర్‌ అనాలి. లేదంటే హరీష్‌రావు ఫీల్‌ అవుతారు
 • మామపై ఎప్పుడు కడుపు రగిలినా మమ్మల్ని తిడతాడు
 • కేసీఆర్‌కు హరీష్‌రావు వెన్నుపోటు పొడుస్తాడు
 •  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top