ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఎవ‌రు?

మాజీ మంత్రి కొడాని నాని

అమరావతి పాదయాత్రను అడ్డుకున్నామా? పవన్‌ను అడ్డుకున్నామా?

ప్రధాని ఏపీకి వస్తే టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేశారు

అమిత్‌షా తిరుమలకు వస్తే చంద్రబాబు రాళ్లు, చెప్పులు వేయించారు

ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ వ్యక్తి చంద్రబాబు

పవన్‌ ప్యాకేజీ తీసుకుని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు

లోకేష్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు

మద్యాన్ని ఏరులై పారించిన వ్యక్తి చంద్రబాబు

గుడివాడ: చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ అంబేద్కర్‌ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమైతే..దానిపై చర్చ జరుగకుండా చంద్రబాబు, పవన్‌ దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.  పనికిమాలిన పప్పు నా కొడుకా..సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడేది..సీఎం వైయస్‌ జగన్‌ పులి కాబట్టే మంగళగిరిలో నువ్వు ఆహారం అయ్యావు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.  చంద్రబాబు చేసిన వెధవ పనుల వల్లే 420 అంటున్నారు. 
వైయస్‌ జగన్‌కు వచ్చిన గేమ్‌..పొలిటికల్‌ ఫుట్‌బాల్‌..ఒకే ఒక షాట్‌..10 బాళ్లు ఒకేసారి గోల్స్‌లో పడుతాయని హెచ్చరించారు.  ప్రభుత్వం చేస్తున్న మంచిని, సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చ జరుగకుండా ప్రతిపక్షం అడ్డుపడుతుందని మండిపడ్డారు. శుక్రవారం కొడాని నాని మీడియాతో మాట్లాడారు.

పనికిమాలిన విషయాలపై కుల మీడియాలో చర్చలా..?
            నిన్న కృష్ణా జిల్లా అవనిగడ్డలో ముఖ్యమంత్రిగారి కార్యక్రమం విజయవంతం అయితే సాయింత్రానికి లోకేష్ మైక్ ముందుకు వచ్చి పిల్లి కూతలు కూశాడు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను గత తెలుగుదేశం ప్రభుత్వం 22-ఏలోకి చేర్చితే.. దానివల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ భూములను 22ఏ నుంచి తీసేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు 35 వేల ఎకరాలకు పైగా రైతులకు అవనిగడ్డలో హక్కుదారి పట్టాలను అందించారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా  33వేల ఎకరాలను భూములను తీసుకున్నాడు. ఆ ప్రాంతంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలని, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనా, పొలాలు, స్థలాలు కొనాలన్నా, అమ్ముకోవాలన్నా అక్కడే జరగాలని ఓ పెద్ద కుట్రకు ప్లాన్ వేశాడు.  కృష్ణా, గుంటూరు జిల్లాలో 30వేల ఎకరాలను కండీషనల్ పట్టా అని 22ఏలో పెట్టేశాడు.  అంటే దానిమీద అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. ఆ భూములపై రైతులకు ఎలాంటి హక్కులు ఉండవు. జమీందారీ పట్టాలు, అసైన్డ్ భూములతో పాటు 1954 ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను కూడా రకరకాల పేర్లతో లక్షల ఎకరాలను 22ఏలో పెట్టారు. అలానే అమరావతి ప్రాంతంలో, గ్రీన్ జోన్ అంటూ వ్యవసాయం చేసుకోవడానికి తప్ప, మరొకదానికి ఉపయోగించుకోకూడదని, లేఅవుట్లు వేయకూడదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీల్లేకుండా గుడివాడ నియోజకవర్గంలోని రెండు మండలాలతో పాటు కృష్ణా, గుంటూరు  జిల్లాలోని  పలు మండలాల్లో  తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిబంధనలు పెట్టి రైతులను పూర్తిగా ఇబ్బందులు పెట్టింది.  సీఆర్డీయేలో చట్ట సవరణలు చేసి, అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని, వెంచర్లు వేయవచ్చని,  గత ప్రభుత్వ కుట్రలను భగ్నం చేస్తూ..  గతంలో ఎవరైతే ఆ భూముల సాగు చేసుకుంటున్నారో వారికి ఆ భూములపై ముఖ్యమంత్రిగారు సంపూర్ణ హక్కు కల్పించారు. ఇంత పెద్ద అంశాన్ని పక్కదారి పట్టిస్తూ.. పవన్ కల్యాణ్ చెప్పు చూపించి చేసిన వ్యాఖ్యలపై, ముఖ్యమంత్రిగారు స్పందిస్తే వాటిని డైవర్ట్ చేయడానికి టీడీపీతో పాటు దాని అనుకూల మీడియా నానా పాట్లు పడుతోంది. చంద్రబాబుకు నాలుగు అనుకూల మీడియాలు ఉంటే ... మాకు కేవలం సాక్షి మాత్రమే ఉంది. ముఖ్యమంత్రిగారు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న మంచిపై డిబేట్ జరగకూడదు. దాంతో, దత్తపుత్రుడికి విరామం ఇచ్చి, ఉత్తుత్తి పుత్రుడిని లైన్ లోకి తీసుకువచ్చారు. "ప్యాలెస్ పిల్లి...  కొడుకు  ముఖ్యమంత్రి" అంటూ వాగిన వాడు ఎవడు? వాడు వాగుతాడు. దానిపై మేము స్పందిస్తే బూతులు తిట్టామంటారు. పనికిమాలిన దద్దమ్మ, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని శుంఠ, చవట వాగుడుకు మేమేమీ మాట్లాడకూడదా?.  ఎంతసేపటికీ లోకేష్ గాడు ఏం తిట్టాడు, పవన్ కల్యాణ్ ఏం తిట్టాడు, కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నానిలు ఏం తిట్టారనే దాని మీదే కుల మీడియాలో డిబేట్లు జరగాలి.  కేవలం బటన్ నొక్కి డీబీటీ ద్వారా లక్షా 79వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరిన దాని మీద, ఇంటింటికి వెళ్లి ఇచ్చే పెన్షన్లు, పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు, సంక్షేమ కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదా?. జయంతికి, వర్థంతికి తేడా తెలియని పనికిమాలిన పప్పు నోటికొచ్చినట్లు మాట్లాడితే.. దాన్ని ఎల్లో మీడియా గొప్పగా చూపిస్తుందా..?. అందుకే చంద్రబాబు, తన పనికిమాలిన పప్పును పక్కకుపెట్టి,  హోటల్ కు వెళ్ళి మరీ దత్తపుత్రుడి బూట్లు నాకుతున్నాడు. 

పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ఆహారమవుతావ్..!
            జయంతికి, వర్థంతికి తేడా తెలియకపోయినా ఫర్వాలేదు కానీ, పిల్లికి, పులికి తేడా తెలియకపోతే ... ఆ పులికే ఆహారం అవుతాడు. జగన్ మోహన్ రెడ్డిగారు పులి. ఆయన పులి కాబట్టే మంగళగిరిలో నువ్వు ఆహారం అయిపోయావు. పనికిమాలిన దద్దమ్మ అయ్యావు. నీలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆఖరికి, చంద్రబాబు కూడా అదే అనుకుంటున్నాడు. అందుకే పక్క పార్టీవాళ్ల దగ్గరకు వెళ్లి తనను గెలిపించాలంటూ వాళ్ల బూట్లు నాకుతున్నాడు.  అయినా నారా లోకేష్ కు సిగ్గూ, శరం లేదు. జగన్ గారు ఎక్కడకు వెళ్లినా రెండు చేతులతో నమస్కారం పెడతారు. అది పెద్దవాళ్లు అయినా.. చిన్నవాళ్లు అయినా. అంతేకానీ ఆయన చేతులు ఊపుతున్న వీడియోలు ఎక్కడైనా చూపించగలవా లోకేష్? జగన్ గారు కిటికీలు, తలుపులకు చేతూలు ఊపారా? నువ్వు చూశావా?. పనికిమాలిన పప్పు లోకేష్ అయితే అద్దం ముందు నిలబడి తనకు తానే చేతులు ఊపుకుంటాడు.
- ప్రజాస్వామ్యానికి ఏదో అయిపోయిందంటూ.. టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్న జనసేన, సీపీఐ, లోక్ సత్తా, బీజేపీలు... అయినా లోకేష్ కు కాస్త గడ్డి పెట్టండి.  గుడ్డివాళ్లకు, తోక పార్టీలకు వాస్తవాలు కనిపించవు. ముఖ్యమంత్రిగారిని నోటికొచ్చినట్లు మాట్లాడితే వాళ్ళు మాట్లాడరు. దానిమీద స్పందించి మేము మాట్లాడితే... వాళ్లు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు ఒక్కొక్కడూ  బయటకు వస్తాడు.
- అలా మాట్లాడకూడదు, ఇలా తిట్టకూడదంటూ నీతులు వల్లిస్తారు.  ముఖ్యమంత్రిగారిని తిట్టినా, చెప్పు చూపించినా మేము స్పందించకూడదా? వాళ్లు ఒక్కటి మాట్లాడితే మేము పది మాట్లాడతాం. వాళ్లు ఒక్కళ్లు మాట్లాడితే మేము పదిమందిమి మాట్లాడతాం. 

బాబు పెట్టిన బూతుల స్కూలుకి ప్రిన్సిపల్ అయ్యన్నపాత్రుడు
        బూతులు తిట్టించడానికి ఏకంగా స్కూలు పెట్టిన వాడు చంద్రబాబు నాయుడు.  దానికి అయ్యన్నపాత్రుడిని ప్రిన్సిపాల్ గా పెట్టాడు. కొంతమంది మాస్టర్లను పెట్టి వాళ్ల స్కూల్ లో బూతులు నేర్పించి ముఖ్యమంత్రి గారిని తిట్టించడమే పనిగా పెట్టుకున్నారు. "ముఖ్యమంత్రి గారు పబ్జీ ఆడతారట. ఇసుక, మద్యం మీద ఎంత ఆదాయం వస్తుందని క్యాలిక్యుటేర్ లో లెక్కలు చూసుకుంటారని" అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అయిదు కోట్లమంది కానీ, దేశంలో ఉన్న పదికోట్ల మంది తెలుగువాళ్లు ఎవరైనా సరై... ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతున్న వీడియో కానీ, ఫోటోగానీ ఎవరైనా చూపించగలరా? అని అడుగుతున్నాను.  మా పార్టీలో అయినా సరే, ముఖ్యమంత్రిగారు ఫోన్ లో మాట్లాడటం చూశామని చెప్పమనండి. అధికారిక కార్యక్రమాల్లో తప్ప, ల్యాప్ టాప్, ట్యాబ్ ఆయన ముట్టుకోవడం ఎప్పుడైనా చూశారా?.  సీఎంగారి జేబులో ఎప్పుడూ చిన్న పుస్తకం ఒకటి ఉంటుంది. ఎవరైనా చెబితే దాన్ని రాసుకుంటారు.
- ఇసుక మీద సంవత్సరానికి రూ.750 కోట్ల ఆదాయాన్ని  ప్రభుత్వానికి సమకూర్చుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు. దీనితో పాటు 18 శాతం జీఎస్టీ,  సర్వీస్ ట్యాక్స్ కలిపితే ఏడాదికి ఇసుక మీద వందల కోట్లు ఆదాయాన్ని తీసుకువస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో ఇసుక మీద ప్రభుత్వానికి ఎంతమేర ఆదాయం తీసుకువచ్చారో చెప్పాలి.  ఇసుక ఉచితమని చెప్పిన చంద్రబాబు..  ఎవరికి ఉచితంగా ఇచ్చాడు?. తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫ్రీగా ఇసుక వచ్చి, వారితో అమ్మించి వేలకోట్ల రూపాయిలు దోచుకున్న దుర్మార్గుడు చంద్రబాబు.
- అలానే, మద్యం గురించి చూస్తే.. రాష్ట్రంలో 48వేల బెల్ట్ షాపులు రద్దు చేసింది ఎవరు? జగన్ మోహన్ రెడ్డిగారు కాదా..?. అలానే ప్రభుత్వం పరిధిలోకి మద్యం షాపులను తెచ్చి, సగానికి సగం తగ్గించాం. మద్యం ధరలు పెంచి లిక్కర్ సేవించేవారి సంఖ్య తగ్గించాలనే తాపత్రయం పడిన ముఖ్యమంత్రి జగన్ గారు. రాష్ట్రంలోని డిస్టలరీలకు లైసెన్స్ లు ఇచ్చిందెవరు? జగన్ గారా? చంద్రబాబు నాయుడా? . ప్రభుత్వం పై విమర్శలు చేసేవాళ్లను సూటిగా అడుగుతున్నాను,  ఒక్క డిస్టలరీకి అయినా జగన్ మోహన్ రెడ్డిగారు లైసెన్స్ ఇచ్చారేమో చూపించమనండి.  బెల్ట్ షాపులు, బార్లు, వైన్ షాపులు విచ్చలవిడిగా పెట్టించి, మద్యాన్ని ఏరులై ప్రవహించేలా చేసిన దొంగ, 420 చంద్రబాబు. వాటిమీద ముడుపులు తీసుకున్నది చంద్రబాబు. 

వైయస్ జగన్ గారు ఆడేది పొలిటికల్ ఫుట్ బాల్
      వైయస్  జగన్ గారికి వచ్చిన గేమ్ ఒక్కటే.. అది పొలిటికల్ ఫుట్ బాల్ మాత్రమే. ఆయన పది ఫుట్ బాల్స్ ను ఒకేసారి తన్నగలడు.  ఆయన ఆడిన ఫుట్ బాల్ దెబ్బకు చెట్టుకు ఒకడు.. పుట్టకొకడు అయ్యాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి చివరకు వేరే పార్టీ వ్యక్తి బూట్లు నాకాల్సి వచ్చింది. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా, విడివిడిగా వచ్చినా గోల్ వేయగల మొనగాడు జగన్ మోహన్ రెడ్డిగారు.  జగన్ గారు ఒక సోషల్ ఇంజినీరు. సామాజిక సంస్కరణలు ఎన్నో తెచ్చారు. ఈ రాష్ట్రంలో పదిమంది బీసీలకు కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మొత్తం 17 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. 56 కార్పొరేషన్ లు పెట్టి బీసీ కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు.  కౌలు రైతులకు పంట సాయం అందించారు. రైతాంగం కోసం  ప్రతి గ్రామంలో ఆర్బీకేల ఏర్పాటు,  గ్రామ గ్రామానా సచివాలయాలు. తద్వారా 2లక్షల మందికి శాశ్వత ఉద్యోగులు కల్పిస్తే.. కళ్లున్న కబోధులకు ఇవేమీ కనిపించవా?
- వైయస్ జజగన్ గారి మీద ఏదో ఒకటి బురద చల్లడమే కార్యక్రమమే తప్ప, ఆయన చేసే మంచి కార్యక్రమాలపై వీళ్ళు డిబేట్ చేయరు. వీరికి కేవలం అమరావతి రైతుల పాదయాత్ర మాత్రమే కనిపిస్తుంది. మరి గ్రీన్ జోన్ లో నుంచి తీసేసినవాళ్లంతా రైతులు కాదా? తమ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతమంది రైతులను నాశనం చేశాడో దాని మీద చర్చ జరగకూడదా?.  మూడు రాజధానుల మీద డిబేట్ జరగకూడదు. కేవలం ముగ్గురు పెళ్లాల మీద మాత్రమే డిబేట్ జరగాలా?.  విశాఖను రాజధానిగా చేయాలంటూ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గర్జన కార్యక్రమం ద్వారా తెలిపితే... దాన్ని ఆదిలోనే పీక పిసికి చంపేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుర్మార్గపు ఆలోచన చేశారు. అమరావతి రైతుల యాత్ర గుడివాడకు వస్తే..  800 మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పించాం, వాళ్ళు తొడలు కొట్టినా,  రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోలేదే.  - వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆడే ఫుట్ బాల్ గేమ్ లో ఏ బాల్ అయినా, ఒకే షాట్ లో మొత్తం గోల్స్ లో సెట్ అయిపోతాయి. జగన్ గారు ఆడే  ఈ గేమ్ లో అందరూ బలి అవ్వక తప్పదు.. ఆయన గేమ్ సూపర్ డూపర్ అవుతుంది.

మరి, గ్రీన్ జోన్ లో పెట్టినవాళ్ళు రైతులు కాదా..?
        విశాఖ గర్జన కార్యక్రమం రోజే పవన్ కళ్యాణ్ విశాఖలో ర్యాలీ పెట్టి మా మంత్రులపై విమానాశ్రంలో దాడులు చేయించి, అక్కడ రెండ్రోజులు ఉండి, తీరిగ్గా బెజవాడ వచ్చి చెప్పులు చూపించడం ఎవరి డైరెక్షన్ లో జరుగుతున్నాయి?. ఉత్తరాంధ్ర, రాష్ట్ర ప్రజలు అమాయకులు కారు కదా?.  ఉత్తరాంధ్ర గర్జన గురించో, మూడు రాజధానుల అభివృద్ధి గురించో, వికేంద్రీకరణ గురించో చర్చ జరగాలనుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.  దీన్ని కప్పేటేసి, కేవలం ఆ 29 గ్రామాల వాళ్లు, 33 ఎకరాల వాళ్లే రైతులు.  ఇక రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే అన్నట్టు చర్చలా.  జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా, పవన్, లోకేష్, అయ్యన్నపాత్రుడు లాంటి పనికిమాలినవాళ్లను తీసుకువచ్చి వ్యక్తిగతంగా తిట్టించి, వాటిని, ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 కుల మీడియాల్లో సూట్, బూటు అద్దెకు తెచ్చివేసుకునే మేధావుల పేరుతో కొంతమంది బఫూన్ గాళ్లను కూర్చోబెట్టి చర్చలా..?.  నీచాతినీచంగా ప్రవర్తించే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఉత్తుత్తి కొడుకు లోకేష్ ను కానీ, రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో దారుణాతి దారుణంగా, ప్రతిపక్ష పాత్రకు కూడా పనికిరాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.  వీళ్లు ఉపయోగించిన భాష, చెప్పులు వాళ్లకే ఉపయోగపడుతుంది. దాచిపెట్టుకోమని వారిని కోరుతున్నాను.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఎవరు..?
 - చంద్రబాబు నాయుడు  దొంగ, 420 అని నేను అనటం లేదు. స్వర్గీయ ఎన్టీఆర్ గారే స్వయంగా చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తున్న వాళ్ళు.. గతంలో సతీసమేతంగా తిరుమల దర్శనానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా  వాహనంపై  చంద్రబాబు రాళ్లు, చెప్పులు వేయించాడు. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అమిత్ షా.. అంటూ కారుకు అడ్డం పడటం ప్రజాస్వామ్యమా?. 
- అలానే, దేశ ప్రధానిగా ఉన్న నరంద్ర మోదీ గారు  విమానాశ్రయానికి వస్తే..  గ్యాస్ తో నింపిన నల్ల బెలూన్లును చంద్రబాబు ఎగురవేయించాడు. అదే అమరావతి రైతులు తమ ప్రాంతానికి వచ్చి రాజధాని తమ ప్రాంతంలోనే ఉండాలని ఎలా చెబుతారంటూ నిరసన తెలుపుతూ నల్ల బెలూన్లు ప్రదర్శిస్తే.. అది మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమా?
- చంద్రబాబు హయాంలో.. ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటే.. ఆయన్ను ఇంట్లో పెట్టి బంధించి, ఆయన కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టి, వారిని కొట్టించి, మహిళలపై కూడా దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని రక్షించడమా?
- జగన్ గారిని విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకుని, తిరిగి పంపిస్తే..  చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్టా?
- చంద్రబాబు ఎంగిలి మెతుకులు తినే తోక పార్టీలకు అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?
- ముఖ్యమంత్రి జగన్ గారు ఏం చేశారని ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది? 
- చంద్రబాబు దగ్గర ఉన్న 23మందిని మా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఏమైనా ఇచ్చారా?
- రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడులా, టీడీపీ 
ఎమ్మెల్యేను ఎవరినైనా ఏడాది పాటు సస్పెండ్ చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామా?
- జగన్ గారు పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే,  చంద్రబాబు పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చాడు. ఏది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం..?.  చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో మేము ఒక్క శాతం కూడా చేయలేదు. 
-  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డిగారు. దాన్ని అమలు చేస్తున్నారు.
- పవన్ కల్యాణ్ మీద విశాఖలో మేము ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఆంక్షలు పెడితే హోటల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు  గంటలపాటు ఊరేగింపు జరిగేదా..? జనవాణిని కూడా మేము రద్దు చేయమనలేదు. నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెబితే.. అక్కడే ఉండి రెండ్రోజులు డ్రామా ఆడాడు.
- పవన్ ను రెండుచోట్ల ఎందుకు ఓడించారు. లోకేష్ ను మంగళగిరిలో ఎందుకు ఓటమిపాలు చేశారు?. 74 ఏళ్ల వయసులో చంద్రబాబుకు బూటులు నాకాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది. బాబు చేసిన విధానాల వల్లే ఈ దుస్థితి పట్టింది.  2024 లో కూడా ప్రజలు మిమ్మల్ని గొయ్యి తీసి గోతిలో పాతిపెడతారు.
- గేమ్ ఆడటం రానివాళ్లే గుంపులు గుంపులుగా వస్తారు.  జేపీ ఎవడు? మా వాడు కాదా? సీపీఐ నారాయణ కూడా మావాడే కదా? పవన్ కల్యాణ్ 2019లో పార్టీ పెట్టినప్పుడు వీళ్లందర్నీ మహాకూటమి కాదు.. కుల కూటమి అన్నాడు. మరి ఇప్పుడు ఆ కుల కూటమిలో పవన్ చేరాడు. 
- జేపీ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. రాజకీయ సన్యాసం అంటూ ఏదో చెప్పి, మళ్లీ పోటీ చేస్తానంటున్నాడు. 

తాజా వీడియోలు

Back to Top