మహిళలను అడ్డుపెట్టుకుని చంద్ర‌బాబు నీచ రాజకీయాలు

మాజీ మంత్రి కొడాలి నాని

గోరంట్ల మాధవ్‌పై ఫేక్‌ వీడియో ప్రచారం చేశారు

ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ అంటూ మరో కుట్ర

ఓ జిల్లాకు బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెడితే తప్పేముంది

అంత మంచి కుటుంబంలో పుట్టి..  చంద్రబాబు భజనెందుకు పవన్?

టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు న‌మొద్దు

హైదరాబాద్‌: మహిళలను అడ్డుపెట్టుకుని చంద్ర‌బాబు నీచ రాజకీయాలు చేస్తున్నార‌ని మాజీ మంత్రి కొడాలి నాని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేందుకు  టీడీపీ నేతలు ప్రతీరోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల, మతాల పేరుతో చంద్రబాబు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆయనకు తోడు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.  గోరంట్ల మాధవ్‌పై ఫేక్‌ వీడియో ప్రచారం చేశారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ అంటూ మరో కుట్ర చేశారు. గోరంట్ల వీడియోపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫేక్‌ వీడియోతో పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ ప్రయత్నం చేస్తోందని కొడాలి నాని మండిపడ్డారు.
 
 కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...

ఫేక్ వీడియోలు, రిపోర్టులతో బాబు ఫేక్ రాజకీయం
ఎంపీ గోరంట్ల మాధవ్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న వీడియో వ్యవహారంలో.. అమెరికాలోని ఎక్లిప్స్ లేబొరేటరి నుంచి ఒక ఫేక్ నివేదిక తీసుకొచ్చి, దాన్ని పట్టుకుని టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసిన రిపోర్ట్ .. ఫేక్ అని, ఆ విషయం ఎక్లిప్స్ లేబొరేటరీ చీఫే ఈ మెయిల్ ద్వారా వెల్లడించినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజా క్షేత్రంలో ఎదుర్కొలేక, ఆయన అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్న నాయకుడుగా ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని ఏర్పరుచుకుని, ప్రతిపక్షాలకు అందనంత స్థాయిలో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ పై ఏదోరకంగా బురద చల్లాలనే వీరి పన్నాగం బయటపడింది. 

చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, టీడీపీని మోస్తున్న ఎల్లో మీడియా .. వైయ‌స్ జగన్ పై ప్రతిక్షణం విషం కక్కుతూ.. ఎలాగైనా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని, తద్వారా, రాష్ట్రాన్ని లూటీ చేసి,  వీళ్ళ కుటుంబాల ఆస్తులు పెంచుకోవాలని పదే పదే కుట్రలు చేస్తున్నారు. గుడులపై దాడులు జరుగుతున్నాయని, వైయ‌స్ జగన్ క్రిస్టియన్ అని, డీజీపీ, హోం మంత్రి, ఎస్పీలు క్రిస్టియన్లు అని,  కాబట్టే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, వీళ్ళే దాడులు చేయించి, వీళ్ళే మతాల గురించి మాట్లాడి ఈ ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు.
- కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే.. ఒక దళిత మంత్రి, ఒక బీసీ ఎమ్మెల్యే ఇళ్ళపై దాడులు చేసి, ఆఖరికి కోనసీమలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు అండ్ కో  చేశారు. 

వీరంతా కలిసి, ప్రభుత్వంపై నిత్యం  అసత్యాలు ప్రచారం చేస్తూ.. ఇవేవీ ఫలించక, చంద్రబాబు ఎంత దిగజారిపోయాడు అంటే.. ఆఖరికి బ్లూ ఫిల్మ్ ల వీడియోలు  పట్టుకొచ్చి, వాటికి, మా పార్లమెంటు సభ్యుడు మాధవ్ తల పెట్టి.. సోషల్ మీడియాలో, తెలుగుదేశం వెబ్ సైట్లలో ప్రచారం చేసి, అది తనది కాదు అని చెప్పినా,  అమెరికా నుంచి ల్యాబ్ ద్వారా ఒక దొంగ రిపోర్టు సృష్టించాడు. 
- ఆ నివేదికపై  ఏపీ సీఐడీ వాళ్ళు అమెరికాలోని ల్యాబ్ చీఫ్ కు లేఖ రాస్తే.. పోతిన ఇచ్చిన వీడియో మార్ఫెడ్ వీడియో అని, మార్ఫింగ్ చేసిన వీడియోను మళ్ళీ వేరే మొబైల్ లో తీశారని, దానిని మాత్రమే ఎడిట్ చేయలేదు అని ఇస్తాం, ఒరిజినల్ వీడియో అని చెప్పం అని స్పష్టంగా చెప్పినా.. ఆయన్ను నివేదిక మార్చి ఇవ్వమని పోతిన కోరినా,  అలా ఇవ్వకుండా, టీడీపీ నేతలు ఛలామణి చేస్తున్న నివేదిక ఫేక్ రిపోర్టు అని స్పష్టంగా చెప్పటం జరిగింది.

ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని బాబు నీచ రాజకీయం
అసెంబ్లీ సాక్షిగా నేను, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లు.. మేము అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసి, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి, ఏడ్చి, శోకాలు పెట్టి, తన భార్యను అసెంబ్లీలో ఏదో అన్నారు అని, ప్రాతివత్యం నిరూపించుకోవాలంటే.. నేను తిరిగి గెలిచాకే అసెంబ్లీకి వెళతాను అని, అన్నది తన భార్యనే కాదు, ఎన్టీఆర్ కుమార్తె ను అన్నారని, ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని దిగజారుడు రాజకీయం చేసిన సిగ్గు, శరం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. 

మాధవ్ వీడియో వ్యవహారంలో ఇప్పటివరకూ ఏ ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదు. బాధితులు ఎవరైనా ఉంటే.. టీడీపీ వాళ్ళు అయినా బయటకు తీసుకురండి. బాధితురాలి చేత కంప్లైంట్ పెట్టిస్తే.. ఎంతటి వారినైనా అరెస్టు చేసి జైలులో పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఫేక్ వీడియో.. ఫేక్ డాక్యుమెంట్ లు సృష్టించి.. తర్వాత వాటిపై ఏబీఎన్, టీవీ 5,  తదితర ఎల్లో ఛానళ్ళలో నలుగురు పనికిరాని వ్యక్తులను కూర్చోపెట్టుకుని, వాటిపై  డిబేట్ లు పెట్టి.. ముఖ్యమంత్రి పై దుష్ప్రచారం చేయడం వీరికి నిత్యకృత్యంగా మారింది. 

చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం, పదవి కోసం, తన భార్యను తానే రోడ్డు మీదకు తెచ్చి, ఏడ్చి శోకాలు పెట్టి, మరోవైపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటానికి సిగ్గు ఎక్కడ లేదు అని అడుగుతున్నాను.  

పదవులేమో మీ కులపోళ్ళకు.. అశ్లీలతపై మాట్లాడేదేమో దళితులా..?
టీడీపీలో పదవులేమో చంద్రబాబు వర్గానికి చెందిన,  మా కమ్మ కులానికి ఇస్తాడు. కృష్ణా జిల్లా విషయానికొస్తే.. అక్కడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి వస్తే.. మా కమ్మ వర్గానికి చెందిన గద్దె అనురాధకు ఇస్తాడు. మేయర్ పదవేమో మా కులానికే చెందిన కేశినాని నాని కూతురికి ఇస్తాడు.. అదే, గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోల గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం.. దళిత మహిళలు అనిత, గ్రీష్మలేకనిపిస్తారా.. ?. అంటే పనికి మాలిన అశ్లీల వీడియోల గురించి మాట్లాడాలంటే దళితులు కావాలా..?. టీడీపీలో పదవులు అనుభవించినటువంటి మహిళలు వీటి గురించి మాట్లాడరా..? తలకాయ వంచుకుని మాట్లాడాల్సిన అశ్లీల అంశాలను అనిత, గ్రీష్మలతో మాట్లాడించడమే చంద్రబాబు రాజకీయమా..?

తన రాజకీయం కోసం, పదవి కోసం, చంద్రబాబు ఎటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తాడో అనేది రాష్ట్ర  ప్రజలకు అర్థమైంది. ఆడపిల్లలను, మహిళలను అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నాడు. పుట్టుకతోనే రాజకీయ వ్యభిచారిగా మారిన దుర్మార్గుడు, సన్నాసి చంద్రబాబు

మోడీ చేతులు పట్టుకుని 5సార్లు క్షమాపణలు కోరిన బాబు
మొన్నీమధ్య చంద్రబాబు మోడీని కలవగానే.. , చంద్రబాబు ఎంగిలి మెతుకులు తినే ఎల్లో మీడియా.. "చంద్రబాబు రాగానే మోడీ లేచి నిలబడ్డాడని.. ఢిల్లీ మళ్ళీ మళ్ళీ రావాలని కోరాడని.." ఇలా రకరకాలుగా కథనాలు వండి వడ్డించారు. అసలు అక్కడ జరిగిందేంటంటే.. "నన్ను క్షమించండి.. నన్ను క్షమించండి. నా పక్కన ఉన్న, నన్ను గైడ్ చేసినటువంటి వ్యక్తులు తప్పుగా గైడ్ చేశారు.. క్షమించండి.. " అని 5 సార్లు మోడీ రెండు చేతులు పట్టుకుని చంద్రబాబు వేడుకున్నాడట. రాష్ట్రానికి వచ్చి మాత్రం.. రివర్స్ లో బాబును మోడీ బతిమిలాడుకున్నాడని రాతలు రాయించుకున్నాడు. 

బాబు ఒక ఐరన్ లెగ్ .. ఇతను లెగ్ పెట్టగానే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. చంద్రబాబు.. సోనియా గాంధీ ఇంటికి వెళితే.. రాహుల్, సోనియా గాంధీలు మేం  అధ్యక్షులుగా ఉండబోమని పారిపోయారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం చంద్రబాబు. 

అడ్డమైన అశ్లీల వీడియోలను తెచ్చి, సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో 24 గంటలపాటు బ్లూ ఫిలిమ్స్ ను వేస్తూ... ఆఖరికి ఆ టీవీలు చూడాలంటేనే భయపడే పరిస్థితి. అశ్లీల వీడియోలను ప్రచారంలోకి తీసుకొచ్చిన టీడీపీని మహిళలు బ్యాన్ చేయాలి.  కట్టుకున్న భార్యను రోడ్డు ఎక్కించిన చంద్రబాబు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. 

మీడియా  ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. 
దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రజల మూడ్ తెలుసుకునేందుకు.. ఇండియా టుడే, టైమ్స్ నౌ లు చేసిన సర్వేల్లో.. 17 నుంచి 23 ఎంపీ స్థానాలు వైయ‌స్‌ జగన్ గెలుస్తారని చెబుతున్నాయి. ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రతిపక్ష పార్టీ టీడీపీగానీ,  చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ గానీ, కమ్యూనిస్టులు గానీ.. ఎవరైనా కావొచ్చు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మాట్లాడే అంశాలే లేవు. 
- ఎంతసేపటికీ, దేవాలయంలో రథం తగులబెట్టారని.. దాడులు చేశారని.. వీళ్ళే తగులబెట్టి.. వీళ్ళే దాడులు చేయించి, నింద వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి మీద నెట్టేయాలని చూశారు.
- అలానే, ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే.. అక్కడ టీడీపీ, జనసేన నాయకుల్ని రెచ్చగొట్టి.. అదేదో దేశవ్యాప్త అంశంగా దుష్ర్పచారం చేశారు.
- 420 చంద్రబాబు 23 సీట్లకు పడిపోయినా, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా.. సిగ్గు, శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నాయకుడి పార్టీలో ఎవరు మాత్రం ఎందుకు ఉంటారు. 
- చంద్రబాబు పడేసే చిల్లర డబ్బుల కోసం మీటింగ్ లుపెట్టే పవన్ కల్యాణ్ ను ప్రజలు ఎవరూ నమ్మరు. 

లోకేష్ బతుకే ఫేక్. వాళ్ళ నాన్న 420 అయితే.. అతనొక చిన్న 420
- రోడ్డు మీద వ్యాపారాలు చేసే వాళ్ళకు సమస్యలు ఏమైనా ఉంటే.. ఎవరైనా లోకేష్ దగ్గరకు వచ్చి సమస్యలు చెబుతారా.. 
-పండ్ల బండి అతను దగ్గర వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డబ్బులు అడిగారని లోకేష్ సిగ్గులేకుండా తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడించి.. దానిని ఎల్లో మీడియాలో రాయించి మాపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా.. ?

వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తే.. ఈరోజుకు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.  ఆయన కుమారుడు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి, కులాలు, మతాలకు అతీతంగా, సంక్షేమ పథకాలు అందిస్తూ, ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తున్నాడు. ఇటువంటి నాయకులనే ప్రజలు కోరుకుంటారు, ఆదరిస్తారు. చంద్రబాబు లాంటి వారిని ఎక్కడ ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు కాబట్టే, 23 స్థానాలకు పరిమితం చేసి, కొడుకును కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు. 

మా పేర్లు చెప్పమని చీకోటికి టీడీపీ బెదిరింపులా..?
క్యాసినో జరగలేదు అని గుడివాడ ప్రజలు చెబుతున్నారు. దానిపై గుడివాడకు చెందిన టీడీపీ నేతలెవరూ కూడా మాట్లాడటానికి ముందుకు రాలేదు. చీకోటి ప్రవీణ్ పై ఈడీ దాడులు చేయిస్తే.. టీడీపీకి చెందిన ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, నా పేరు, వల్లభనేని వంశీ పేరు చెప్పమని ఫోన్లు చేసి  బెదిరిస్తున్నారట.  ఈ విషయాన్ని చీకోటి ప్రవీణ్ చెబుతున్నాడు. 
-  గోవాలో లీగల్ గా చేస్తున్నానని.. తెలుగు రాష్ట్రాల్లో చేయడం లేదని అతనే చెబుతున్నాడు. దీనికి చంద్రబాబు నిజనిర్థారణ కమిటీ అని, మేమేదో దోచేస్తున్నామని మాపైన అల్లరి చేసి, ఇప్పుడు  మా పేర్లు చెప్పమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. 
- వ్యభిచారం మీద, బ్లూ ఫిలిమ్ ల మీద, పేకాట మీద, క్యాసినోల మీద రాజకీయాలు చేసే పరిస్థితికి చంద్రబాబు దిగజారాడు. 
- దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఏమో.. గుడివాడలో ఇసుక ట్రక్కులు నావి అంటున్నాడు. చంద్రబాబు ఇచ్చిన పనికి మాలిన స్క్రిప్టు చదివి, అతను కూడా దిగజారిపోయాడు. నాకు 5 లారీలు ఉన్నాయనిగానీ, నాకు సంబంధించిన ఒక్క లారీ అయినా ఇసుక తరలిస్తుందని గుడివాడ వచ్చి,  నిరూపించండి, నిరూపిస్తే గుడివాడ వదిలేసి వెళ్ళిపోతాను.  పవన్ కల్యాణ్ కు సవాల్ విసురుతున్నాను. 
- చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన ఆర్టిస్టువి నీవు. మాపై నోటికొచ్చినట్లు మాట్లాడి.. ఆరోపణలు చేసి తిట్టించుకోవడం నీకు ఎందుకు. సిగ్గు, శరం లేకుండా ఇంకా చంద్రబాబుకు భజన ఎందుకు...?
- చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేదు. నీవు అయినా ప్రజల పక్షాన ఉండి పనిచేయ్. ఆడవాళ్ళను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే బ్రోకర్ చంద్రబాబు పక్కన ఉంటే.. నీ బతుకూ అలానే ఉంటుంది. 2024లో చంద్రబాబుకు రాజకీయ సమాధి ఖాయం. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top