వైయ‌స్ఆర్‌సీపీలోకి మాజీ మంత్రి

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన ఖ‌లీల్‌బాషా
 

హైద‌రాబాద్‌:  ఏపీవ్యాప్తంగా టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నంతో పాటు.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన వున్నం హాస్పిటల్‌ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం నాగమల్లికార్జునరావు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. తాజాగా  క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఖ‌లీల్‌బాషా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి వైయ‌స్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అంజాద్‌బాషా, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top