సీఎంల సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేయాలి

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై బొత్స ఆసక్తికర ట్వీట్‌
 

తాడేపల్లి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ఈ భేటీపై పారదర్శత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు.
 
 మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్‌ వేదికగా..‘విభజన సమస్యల పరిష్కారానికి నేడు రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో  పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయ‌ని మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.
 

Back to Top