ఆంధ్రజ్యోతి వార్త చూసి బాధ..విస్మయం కలిగింది

తప్పుడు రాతలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం

ఒంగోలు:  ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తను చూసి బాధ, విస్మయం కలిగిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎల్లోమీడియా తప్పుడు కథనాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తారన్నారు.  ఒకరోజు జనసేనకి వెళ్తారని, మరోరోజు టీడీపీకి వెళ్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండిచారు. ఒంగోలు హౌస్‌ సైట్స్‌ కోసం ధనుంజయ్‌రెడ్డిని కలిస్తే సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని రాశారని, సీఎం వైయస్‌ జగన్‌ను కలవడానికి తాను అపాయింట్‌ అడగాల్సిన అవసరం లేదన్నారు. ఒంగోలు నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్‌ అయిన సందర్భంలో సీఎం వైయస్‌ జగన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారని గుర్తు చేశారు. ఇంత బాధ పెట్టి మమ్మల్ని ఏం చేయాలని అనుకుంటున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. 

 

తాజా వీడియోలు

Back to Top