కూటమి మూక‌ల‌పై చర్యలు తీసుకోవాలి

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్ష‌లు వైయస్‌ జగన్‌తో పాటు, పార్టీ నాయకులపై కూట‌మి మూకలు పెడుతున్న దారుణ పోస్ట్‌లపై గుంటూరు, పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు  

కూటమి సోషల్‌ మీడియా కార్యకర్తలు పెట్టిన అభ్యంతరకర పోస్ట్‌లను సాక్ష్యాధారాలతో సహా, పోలీసులకు సమర్పించిన  పార్టీ నేతలు 

గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై  సోషల్‌ మీడియాలో కూటమి పార్టీల సోషల్‌ మీడియా మూకలు పెడుతున్న దారుణ పోస్ట్‌లపై గుంటూరు, పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు.  కూటమి సోషల్‌ మీడియా కార్యకర్తలు పెట్టిన అభ్యంతరకర పోస్ట్‌లను సాక్ష్యాధారాలతో సహా, పోలీసులకు సమర్పించిన పార్టీ నేతలు,  వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ బయట వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.  

గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఏమన్నారంటే..: 

– వైయ‌స్ జగన్‌గారు, మా పార్టీ నాయకులపై టీడీపీ కూటమి పార్టీల సోషల్‌ మీడియా కార్యకర్తలు పెడుతున్న అభ్యంతరకర పోస్టులపై గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో 5 ఫిర్యాదులు చేశాం.
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కంట్రోల్‌ చేయలేక సోషల్‌ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో మా కార్యకర్తలను కేసులతో వేధిస్తున్నారు. రిమాండ్‌లోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 
– పేరుకేమో ఏ పార్టీ వారు పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ మేం ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఏఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

ఆ 5 ఫిర్యాదులు ఇవీ..:
తమ పార్టీపై నారా లోకేశ్‌ తన ట్విట్టర్‌ నుంచి పెట్టిన ఒక పోస్ట్‌ అంటూ.. ఆ ప్రింట్‌ చూపిన అంబటి రాంబాబు, తాము చేసిన 5 ఫిర్యాదుల వివరాలు వెల్లడించారు.
– సజ్జా అజయ్‌పై ఒక ఫిర్యాదు 
– స్వాతిరెడ్డి పేరుతో పోస్ట్‌ అవుతున్న అకౌంట్‌పై ఫిర్యాదు.
– అజయ్‌ చౌదరి–1 అనే అకౌంట్‌పై ఫిర్యాదు
– జి3 గాయత్రి అనే మరో మహిళ అకౌంట్‌
– వైయ‌స్ జగన్‌గారి సతీమణిపై మార్ఫింగ్‌ ఫోటోతో పెట్టిన పోస్ట్‌లు.
    వాటన్నింటిపై సాక్ష్యాధారాలతో సహా, పోలీసులకు ఫిర్యాదు చేశామని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరామని అంబటి రాంబాబు వెల్లడించారు.

అత్యంత హేయంగా పోస్ట్‌లు. వేధింపులు:
– డబ్బులిచ్చి, బహుమతులిచ్చి నారా లోకేశ్‌ ఇలాంటి అసభ్యకర పోస్టులు పెడుతుంటే పోలీస్‌ యంత్రాంగం చోద్యం చూస్తుంది. 
– స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు పబ్లిక్‌ మీటింగ్‌లో వైఎస్‌ జగన్‌ చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్న మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా.. దీనిపై కూడా యాక్షన్‌ తీసుకునే శక్తి ఈ ప్రభుత్వానికి ఉందా?

– వీటితో పాటు నాపై, నా కుటుంబంపై పెట్టిన అసభ్యకర పోస్టులకు సంబందించి మరో 5 కేసులు నమోదు చేయడం జరిగింది. 
– వెంగళరావు అనే ఘర్షణ టీవీకి సంబంధించిన వ్యక్తి నాపై పోస్ట్‌లు పెట్టడంతో పాటు, మెసేజ్‌లు పంపిస్తూ బెదిరిస్తున్నారు.
– మరో వ్యక్తి పచ్చి బూతులు తిడుతూ.. ఫోన్‌:99496 55108 నెం.  నుంచి మెసేజ్‌లు పెడుతున్నాడు. 
– ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు గతంలో నాపై, నా కుమార్తెపై పెట్టిన మరో పోస్ట్‌. ఆయన నోరు తెరిస్తే బూతులే. అయినా ఆయనపై కేసులుండవా?.
– కృష్ణసాగర్‌ అనే వ్యక్తి నా కుమార్తెపై పెట్టిన పోస్టు.. అంటూ చూపిన అంబటి రాంబాబు, వాటిపై ఫిర్యాదు చేసి, అవి పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

అన్యాయంగా కేసుల నమోదు:
– హోం మంత్రి అనిత బైబిల్‌ పట్టుకుని తిరుగుతానని ఆమె చెప్పుకున్నారు. ఆమె ఎస్సీనో క్రిస్టియనో అని ప్రశ్నించినందుకు మా పార్టీ వారిపై కేసు పెట్టారు. 
– మైకు ముందు హోం మంత్రి అనిత అయితే వ్యవహారాలన్నీ చూసేది మాత్రం లోకేశ్‌.. ఎవర్నయినా వెధవ, వాడు, అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దమ్ముంటే నిలబడండి, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతుంది. ఆమెపైన కూడా చర్యలు తీసుకోవాలి. 

ఎదుర్కొంటాం. పోరాడతాం:
– మా కార్యకర్తలపై ఎలాగైతే చర్యలు తీసుకున్నారో మేం పెట్టిన కేసులపై కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా పోరాడతాం. 
– ఈరోజు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం జరుగుతుందని ప్రచారం చేçస్తున్నారు. మూడో ఛాప్టర్‌ అంటున్నారు. ఎన్ని ఛాప్టర్లు అయినా రాసుకొండి. మేం భయపడం. 
– పరిస్థితులు ఇలాగే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది.  

అన్ని మార్గాలు అన్వేషిస్తాం:
– మా నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని ఫిర్యాదు చేసి 20 రోజులైనా ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 
– పోలీసు యంత్రాంగం, నారా లోకేశ్‌ కలిసి అరాచకం çసృష్టిస్తున్నారు. పక్షపాతం లేకుండా చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. 
– అనైతికంగా వ్యవహరిస్తే ఈ పోలీసులు కూడా రాబోయే రోజుల్లో చట్టం ముందు శిక్షించబడతారని గుర్తుంచుకోవాలి. 
– ఏ తప్పునైనా న్యాయపరంగా విచారించాలి. అంతే తప్ప అక్రమంగా వేధింపులకు దిగితే మాత్రం సహించం. ఇలాంటి పరిపాలన విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు.  
– నిందితులకు శిక్షపడేలా అవసరమైన అన్ని మార్గాలు అన్వేషిస్తాం. ఆ దిశలో ఇప్పటికే పలు చోట్ల ప్రైవేట్‌ కేసులు నమోదు చేశామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వివరించారు.

Back to Top