వైయస్‌ఆర్‌ సీపీలోకి మాజీ మంత్రి అహ్మదుల్లా సోదరులు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా సోదరులు మహ్మద్‌ హబీబుల్లా, మహ్మద్‌ ఇనాయతుల్లా వారి కుటుంబ సభ్యులతో కలిసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, పార్టీ గల్ఫ్‌ విభాగం కన్వీనర్‌ ఇలియాస్‌ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ మేరకు వారిని జననేత సాదరంగా ఆహ్వానించి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Back to Top