వైయస్‌ జగన్‌తో కేంద్ర మాజీ మంత్రి భేటీ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి కిలి కృపారాణి దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో కృపారాణి, ఆమె భర్త జననేతను కలిశారు. ఇటీవల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలుసలు అధికమయ్యాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. తాజాగా కిల్లి కృపారాణి దంపతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. వీరు కూడా వైయస్‌ఆర్‌సీపీలో చేరే అవకాశం ఉంది.
 

Back to Top