సామాజిక సమతా సంకల్ప సభకు సర్వం సిద్ధం

సాయంత్రం 6 గంటలకు సీఎం వైయ‌స్‌ జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

బడుగు బలహీన వర్గాలపై  సీఎం వైయ‌స్‌ జగన్ ప్రేమకు నిదర్శనం ఈ మహా విగ్రహం

విగ్రహం రూపకల్పనలో మరో విశ్వకర్మ గా సీఎం వైయ‌స్‌ జగన్

దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా ఖ్యాతి: ఎంపీ విజయసాయి రెడ్డి

విజయవాడ: దేశ చరిత్రలోనే మహాఘట్టంగా నిలిచిపోయే 206 అడుగుల ఎత్తైన డా బి. ఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ నేటి సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగనుందని, ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు అంబేద్కర్ సిద్దాంతాలకు అభిమానించే వారు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు లక్షా యాభై వేల మంది ప్రజలు హాజరు కానున్నారని రాజ్యసభ సభ్యులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 
విజయవాడలో శుక్రవారం జరగనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 'సామాజిక న్యాయ మహాశిల్పం' ఆవిష్కరణ, సామాజిక సమతా సంకల్ప సభ కార్యక్రమాల ఏర్పాట్లను గురువారం నాడు పార్టీ నాయకులతో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వి విజయసాయిరెడ్డి పరిశీలించారు..అలాగే అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం కింద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసే మ్యూజియంను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు..

అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా రూపొందించిన ఈ శిల్ప ఖండం నుండి జీవ కళ ఉట్టిపడుతోందని అన్నారు.  అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే ముందుండే సీఎం జగన్ గారు  అధికారంలోకి వచ్చి కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే సాకారం చేశారని అన్నారు. ఈ అద్భుత శిల్ప ఖండం రూపొందించడంలో సీఎం జగన్ మరో విశ్వకర్మ గా మారారని అన్నారు. ఈ  మహా విగ్రహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలకు ప్రతిబింబిస్తోందని అన్నారు.  అంబేద్కర్ స్మృతివనం దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అవతరించనుందని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియంలో అంబేద్కర్ బాల్యం, విద్యాభ్యాసం, ఇతర ఘట్టాలకు సంబంధించి చిత్రాల్లో జీవం ఉట్టిపడుతోందని అన్నారు. దేశంలో పంజాబ్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఇటువంటివి ఉన్నా వాటన్నింటికీ మించి సందర్శకులు ఇక్కడ అద్బుత అనుభూతలు పొందుతారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షా యాభై వేల మంది విగ్రహావిష్కరణకు, బహిరంగ సభకు హాజరవుతారని అన్నారు. అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాటు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసిందని అన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఈ మహా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హాజరు కావాలని కోరారు. ఈ నెల 20 తేదీ నుండి ప్రజలు నేరుగా సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 
ఈ ఏర్పాట్లను మంత్రులు మేరుగు నాగర్జున, కే.నారాయణ స్వామి,జోగి రమేష్,ఎంపీలు నందిగం సురేష్, కేశినేని నాని,మాజీ మంత్రులు సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు,  ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్,పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ  పార్టీ సమన్వయ కర్త దేవినేని అవినాశ్  తదితరులు విజయసాయిరెడ్డి తో కలసి పరిశిలించిన వారిలో ఉన్నారు..
 

Back to Top