సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలవైపు వైయస్‌.జగన్‌ సర్కారు అడుగులు

రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్న నోబెల్‌ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ఎస్తర్‌ డఫ్లో

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో సమావేశమైన ఎస్తర్‌ డఫ్లో బృందం

ముఖ్యమంత్రి దార్శినికుడు :ఎస్తర్‌ డఫ్లో

పేదరిక నిర్మూలన పట్ల అంకిత భావంతో ఉన్నారు: ఎస్తర్‌ డఫ్లో

ముఖ్యమంత్రి ఒక గదిలో కూర్చొని పథకాలు తీసుకురాలేదు: ఎస్తర్‌ డఫ్లో

క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పథకాలు తీసుకు వచ్చారు: ఎస్తన్‌ డఫ్లో

దీనివల్ల కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మేం చెప్పాల్సింది ఏమీ ఉండదు:

అమలవుతున్న వాటిని మరింత బలోపేతం చేయడానికి మాత్రమే మా తరఫు నుంచి సలహాలు ఇస్తాం:

తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ అధికారులతోనూ సమావేశమైన నోబెల్‌విజేత ఎస్తర్‌ డఫ్లో బృందం

అమరావతి:  సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలవైపు వైయస్‌.జగన్‌ సర్కారు అడుగులు వేస్తుంద‌ని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ఎస్తర్‌ డఫ్లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి చేస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో క్యాంప్‌ కార్యాలయంలో ఎస్తర్‌ డఫ్లో బృందం స‌మావేశ‌మైంది.  ఈ సంద‌ర్భంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళా సాధికారిత అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను ఎస్తర్‌ డఫ్లో బృందానికి వివరించిన సీఎం. 
– ఆతర్వాత సీఎంతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించిన ఎస్తర్‌ డఫ్లో.
– పాదయాత్రలో సీఎం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని అర్థంచేసుకుని ప్రభుత్వ పథకాలన్నీ రూపొందించారన్న ఎస్తర్‌ డఫ్లో
– ఒక గదిలో కూర్చుని సీఎం పథకాలకు రూపకల్పన చేయలేదు. 
అలా చేస్తే అవి కేవలం థియరిటికల్‌గా ఉంటాయి:ఎస్తర్‌ డఫ్లో
– అర్హులు ఎవ్వరూ మిగిలిపోకూడదంటూ ముఖ్యమంత్రి  తీసుకుంటున్న చొరవ.. అనేది, ఆయన గొప్ప ఆలోచనా దృక్పథాన్ని వెల్లడిస్తోంది:ఎస్తర్‌ డఫ్లో
– పేదరికాన్ని నిర్మూలించాలనే ఆయన అంకితభావాన్ని వెల్లడిస్తోంది:ఎస్తర్‌ డఫ్లో
– డీబీటీ స్కీంల్లో అధికభాగం నేరుగా మహిళల ఖాతాల్లోకి వేయడం, అలాగే గృహనిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది.. కేవలం మహిళా సాధికారికతకే కాదు.. దీనివల్ల  అన్నిరకాలుగా కుటంబం సుస్థిరమవుతుంది: ఎస్తర్‌ డఫ్లో
–సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు, దాని ప్రభావంపై స్టడీ చేసి, సలహాలు కోరడం అనేది కూడా సీఎంగా ఆయనకున్న దార్శినికతకు నిరద్శనం:ఎస్తర్‌ డఫ్లో 
– పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి సీఎం పథకాలు పెట్టారు కాబట్టి... ఏం చేయాలన్నదానిపై మేం పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. వాటి బలోపేతం కోసం సలహాలు సూచనలు చేస్తాం: ఎస్తర్‌ డఫ్లో

*వీడియో బైట్‌లో ఎస్తర్‌ డఫ్లో మాట్లాడిన అంశాలు*:
– ముఖ్యమంత్రితో నిర్మాణాత్మకంగా చాలా చక్కటి సమావేశం జరిగింది. 
– ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. 
– ముఖ్యమంత్రిగారితోపాటు, అయనతో కలిసి పనిచేస్తున్న అధికారుల బృందాన్ని కూడా కలుసుకున్నాం. 
– వివిధ అంశాలపై భవిష్యత్తులో వారితో కలిసి పనిచేయడంపైనా మేం దృష్టిపెడుతున్నాం. 
– పేదల అభ్యున్నతికోసం చేస్తున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. 
– వారి కనీస అవసరాలను తీర్చడానికి, సుస్థిర ఆర్థిక ప్రగతికోసం, చేపడుతున్న కార్యక్రమాల గురించి చెప్పారు. 
– తన స్వీయ అనుభవాలనుకూడా సీఎం మాతో పంచుకున్నారు. 
– పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంచడమనే లక్ష్యసాధనలో వారితో కలిసి పనిచేస్తాం:
– రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి:
– వివిధ అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కున్న పరిజ్ఞానం మమ్మల్ని ఆకట్టుకుంది:
– ఆయనకున్న అంకిత భావం కూడా ఆకట్టుకుంది:
– గడచిన 15 ఏళ్లుగా వివిధరంగాల్లో జె–పాల్‌ పనిచేస్తోంది. 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో పైలట్‌ప్రాజెక్టు కింద కొన్ని అంశాల్లో పనిచేస్తున్నాం:

(జె–పాల్‌ అంటే ది అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌. ఇందులో ఎస్తర్‌ డఫ్లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సహ వ్యవస్థాపకురాలు కూడా. దక్షిణాసియాకు సంబంధించి జె–పాల్‌ తరఫున సైంటిఫిక్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంఐటీ ప్రొఫెసర్‌ కూడా)

–ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలకు సంబంధించిన వివరాలను అందించిన సీఎస్‌ సమీర్‌ శర్మ
– ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన సీఎస్‌

ఈ సమావేశంలో ఎస్తర్‌ డఫ్లోతో పాటు ఆమె బృంద సభ్యులు శోభిని ముఖర్జీ, కపిల్‌ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్‌ శర్మతో పాటు చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top