ఇరిగెల సోదరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైయస్‌ జగన్‌
 

హైదరాబాద్‌: ఆళ్లగడ్డకు చెందిన ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు కొద్దిసేపటి క్రితం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇరిగెల సోదరులు కలిశారు. ఈ సందర్భంగా వారికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కృషి చేస్తామని రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు. 

 ఇరిగెల రాంపుల్లారెడ్డి గతంలో ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్‌గా పనిచేశారు. అయితే టీడీపీలో తమకు సరైన గౌరవం లేదని, కష్టకాలంలో అండగా నిలిచిన తమకంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఇరిగెల సోదరులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్‌, అవంతి శ్రీనివాస్‌, దాసరి జై రమేష్‌ తదితరులు బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.  

Back to Top