సాకారం దాల్చిన సీఎం వైయస్‌ జగన్‌ ఆశయం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తొలి ఏడాది పాలనలోనే విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలుస్తున్నారు. సంక్షేమం పథకాల అమలులో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన నూతన ఒరవడి మంచి ఫలితాలను ఇస్తుంది. నిర్దిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ పథకాలను అందించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే రేషన్, పెన్షన్‌ కార్డులు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టా అందజేయాలని కలెక్టర్ల, అధికారులకు సూచించిన విషయం తెలిసిందే.

ఈ విప్లవాత్మక నిర్ణయంలో భాగంగానే ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తు దారులకు పెన్షన్‌ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో 96,568 మందిని అర్హులుగా తేల్చారు. పది పని రోజుల్లో ప్రభుత్వ సేవలు అందించాలన్న సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు నేడు జిల్లాల వారీగా పెన్షన్‌ కార్డులను జారీ చేశారు. తిరస్కరించిన దరఖాస్తులకు కూడా నిర్దిష్టంగా కారణాలను వెల్లడించారు. దీంతో సీఎం సంకల్పించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట సమయంలో సంక్షేమ పథకాలు అందించాలన్న ఆశయం సాకారమైంది. 

Back to Top