టెన్త్, ఇంటర్‌ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం

ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో జూలై మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు, జూలై చివరి వారంలో టెన్త్‌ పరీక్షలు నిర్వహించేందుకు పరిశీలనలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించిన అనంతరం పరీక్షలపై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. 2008 డీఎస్సీ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైయస్‌ జగన్‌ మానవతా దృక్పథంతో వ్యవహరించారన్నారు.  డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top