చదువులమ్మ ఒడిలో పిల్లలందరూ సమానమే

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి: చదువులమ్మ ఒడిలో పిల్లలందరూ సమానమేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పిల్లల్లో సమైక్యత భావాన్ని పెంపొందించేందుకే స్కూల్‌ రిజిస్టర్‌లో మార్పులు చేశామని తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్కూల్‌ రిజిస్టర్‌లో కులం, మతం రాయొద్దని ఆదేశించామన్నారు. పిల్లల టీసీలను గతంలో ఇచ్చినట్లుగానే ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో అన్ని కులాలు, మతాలు సమానమేనని చెప్పారు. కాగా, స్కూల్‌ అటెండెన్స్‌ రిజిస్టర్‌పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. విద్యార్థుల అటెండెన్స్‌ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని, ఆ కాలమ్‌ను వెంటనే తొలగించాలని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top