నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందిస్తాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమ్మ ఒడి పథకం ప్రకటనతోనే గణనీయంగా అడ్మిషన్లు పెరిగాయి

విద్యాశాఖలో ఖాళీలు త్వరలో భర్తీ
 

పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యం

అమరావతి: గుణాత్మకమైన, నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందించడం ఈ ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారితనం, అవినీతిరహిత వ్యవస్థే మా ధ్యేయమన్నారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం విషయంలో మా సీఎం స్పందించిన తీరు అద్భుతమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందిస్తామని చెప్పారు. 
అసెంబ్లీ సమావేశాల్లోని ప్రశ్నోత్తరాల సమయంలో విద్యా వ్యవస్థపై జరిగిన చర్చలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు.

ఆనాధ పిల్లలకు ఐదు శాతం, గిరిజన పిల్లలకు ఐదు శాతం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి విద్యా హక్కు చట్టంలో భాగంగా 25 శాతం ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత విద్యను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్బన్‌ ఏరియలో ప్రతి నెల రూ.70 ఫీజు ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజన్న బడిబాట ద్వారా విద్యార్థులను బడిబాట పట్టించామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇదే అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. జీవో 42, 44 గత ప్రభుత్వం ఎందుకు ఇంప్లీమెంట్‌ చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ ప్రక్రియ ద్వారా వందల వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ వ్యవస్థపై ప్రతిపక్షం అవహేళనగా మాట్లాడుతుందన్నారు.

ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోయిందని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లో విద్యా వ్యవస్థపై సీఎం మూడు సమీక్షలు నిర్వహించారని తెలిపారు. నవరత్నాలను మా నాయకుడు చిత్తశుద్ధితో అమలు చేస్తారని చెప్పారు. అమ్మ ఒడి కార్యక్రమం ఇప్పటికే ప్రకటించామని, జనవరి 26వ తేదీన బడికి పంపించిన ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తామన్న మాట చెప్పినందుకే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగిందన్నారు. స్కూల్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ కల్పిస్తున్నామన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా మార్పు చేస్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు.

44 వేల ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని రెండేళ్లలో మార్చుతామని మా నాయకుడు చెప్పారని తెలిపారు. గుణాత్మకమైన, నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందించడం ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం వీసీల పోస్టింగ్, ప్రొపెసర్స్‌ భర్తీల్లో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. స్కూల్స్‌ ప్రారంభ దశలోనే 90 శాతం పుస్తకాలు అందించామని చెప్పారు. అన్ని పాఠశాలల్లో మాతృభాషాను త ప్పనిసరిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రోఫెసర్స్‌ బాలకృష్ణన్‌ ఆధ్వర్యంలో రీఫర్స్‌ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలోనే మా ప్రభుత్వం చాలా చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. 

 

Back to Top