సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో అజేంద్ర బ‌హ‌దూర్ సింగ్ భేటీ

డిసెంబ‌ర్ 4న విశాఖ‌లో జ‌రిగే నేవీ డే వేడుక‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్ చీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను ఆహ్వనించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని ఈఎన్‌సీ సీఐఎన్‌సీ సీఎంకి వివరించారు. అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్‌ఆర్‌ అండ్‌ మిలన్‌ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.  అనంత‌రం ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ను ముఖ్య‌మంత్రి సన్మానించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు. సీఎంని క‌లిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ వికాస్‌ గుప్తా, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి, ఫ్లాగ్‌ లెఫ్టినెంట్‌ శివమ్‌ కందారి ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top