సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి మ‌హిళ‌ల‌ను ర‌క్షించేందుకే ఈ-ర‌క్షా బంధ‌న్‌

ఈ-ర‌క్షా బంధ‌న్ ‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
 

 తాడేప‌ల్లి: సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డ‌కుండా మ‌హిళ‌ల‌ను ర‌క్షించేందుకు ఈ-ర‌క్షాబంధ‌‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఈ-ర‌క్షా బంధ‌న్ యాప్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..డీజీపీ ఆదేశాల‌తో మ‌హిళా ర‌క్ష‌ణ కోసం ఈ-ర‌క్షాభంద‌న్ యాప్‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పోలీసు, సీఐడీ, సైబ‌ర్ పీఎస్ ఫౌండేష‌న్ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతార‌న్నారు. 30 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల పేర్ల‌తో రిజిస్ట్రేష‌న్ చేయిస్తున్న‌ట్లు చెప్పారు. 

ఏదైన స‌మ‌స్య ఉంటే దిశ యాప్‌, సైబ‌ర్ మిత్ర‌, దిశ పీఎస్‌లో ఫిర్యాదులు చేయ‌వ‌చ్చు అన్నారు. సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్స్‌తో నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో శిక్ష‌ణ ఇచ్చామ‌న్నారు. యూ ట్యూబ్ చాన‌ల్ ద్వారా స్కూల్స్‌, కాలేజీలు, వ‌ర్కంగ్ ఉమెన్స్‌కు మెల‌కువ‌లు నేర్పుతార‌న్నారు.  షార్ట్ ఫిల్మీం, యానిమేష‌న్స్‌, రీడింగ్ మెటిరీయ‌ల్ ద్వారా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు త‌ల‌పెడుతున్న‌ట్లు చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక 33 శాతం వైన్ షాపులు త‌గ్గించామ‌ని చెప్పారు.  ప‌ర్మిట్ రూములు పూర్తిగా ఎత్తేశామ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఈ ప్ర‌భుత్వంలో అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. అనంత‌రం మ‌హిళా ఎమ్మెల్యేలు, మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ, త‌దిత‌రులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీ క‌ట్టి శుభాకాంక్ష‌లు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top