మెరుగైన వైద్యం అందించేందుకు వైయస్‌ జగన్‌ కృతనిశ్చయం 

విశాఖ కేజీహెచ్‌లో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తనిఖీలు 
 

విశాఖ: నిరుపేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని వైద్యులకు సూచించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని మంత్రులు శనివారం తనిఖీ చేశారు. గతంలో కేజీహెచ్‌లో కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని మరణాలు సంభవించాయని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. కేజీహెచ్‌లో అవినీతి పెరిగిపోయిందన్నారు. పోస్టుమార్టం కోసం కూడా లంచం తీసుకుంటున్న దుస్థితి నెలకొందన్నారు. గిరిజనులు వస్తే మీ కుటుంబ సభ్యుడిగా స్పందించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కొందరు వైద్యులు, సిబ్బంది పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 

Back to Top