ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

ఉప ముఖ్యమంత్రి పుష్పాశ్రీవాణి  

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా పక్షపాత ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి పుష్పాశ్రీవాణి తెలిపారు. గత ప్రభుత్వం మహిళలను మోసం చేస్తే..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అదే మహిళలకు సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలతో ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. మహిళలను కోర్టులు, బ్యాంకుల చుట్టూ తిప్పిన తీరు అందరం చూశామన్నారు. సున్నా వడ్డీ రుణాలు చెల్లించకుండా డ్వాక్రా మహిళలను దగా చేశారన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు వీధికో బెల్టు షాపులను ఏర్పాటు చేసి మహిళల జీవితాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు,బీసీల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. మహిళా అధికారిణి వనజాక్షి పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు చూశామన్నారు.

ఎన్నికలు వస్తున్నాయని తెలిసి పసుపు–కుంకుమ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఇసుక ర్యాంపులను మహిళలకు ఇచ్చారని, ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు ఎక్కడా లబ్ధి చేకూరలేదన్నారు. మహిళలను అనునిత్యం మోసం చేసే దిశగా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళలను గౌరవిస్తూ, వారి అభ్యున్నతి దిశగా ముందుకు వెళ్తుందన్నారు. 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌ ఆడబిడ్డల కష్టాలను కళ్లారా చూశారని చెప్పారు.

ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని చంద్రబాబు అంటే.. అదే మహిళకు హోం మంత్రిని చేసిన ఘనత వైయస్‌ జగన్‌ది అన్నారు. ఎస్టీ మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉన్నత స్థానంలో ఉంచారని చెప్పారు. ప్రతి తల్లి కూడా తన బిడ్డను స్కూల్‌కు పంపించే దిశగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు. గ్రామ వాలంటీర్లుగా 50 శాతం మహిళలకే ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలు వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా అందించి ఆర్థిక చేయూతనందిస్తారని చెప్పారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించారని చెప్పారు. వైయస్‌ జగన్‌ నిర్ణయానికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ నాయకుడు తీసుకొని నిర్ణయాలు మా నాయకుడు వైయస్‌ జగన్‌ తీసుకున్నారని చెప్పారు. మాట ఇస్తే వెనుకడుగు వేయని నాయకుడు మా జగనన్న అని తెలిపారు. మొన్న కేబినెట్‌లో కూడా మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని సీఎం చెప్పినట్లు తెలిపారు. అమ్మో ఆడబిడ్డ పుట్టిందా అనే పరిస్థితి నుంచి మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంతోషపడే పరిస్థితిని వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారని తెలిపారు. మహిళలకు పెద్ద పీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలకు మద్దతు పలుకుతూ మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పుష్పాశ్రీవాణి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top