ప్ర‌జ‌ల ఆరోగ్యం క‌న్నా..డ‌బ్బు ముఖ్యం కాద‌న్న‌దే సీఎం సంక‌ల్పం

క‌రోనాపై ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంది

క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌తి నెల రూ.350 కోట్లు ఖ‌ర్చు

వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

వైయ‌స్ఆర్ జిల్లా: ప్ర‌జ‌ల ఆరోగ్యం క‌న్నా డ‌బ్బు ముఖ్యం కాద‌న్న సంక‌ల్పంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందుకు వెళ్తున్నార‌ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని తెలిపారు. బుధ‌వారం ఆయ‌న వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించారు. క‌డ‌ప న‌గ‌రంలోని కోవిడ్ ఆసుప‌త్రిని ప‌రిశీలించి, వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క‌రోనా నియంత్ర‌ణ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నార‌ని చెప్పారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు నెల‌కు రూ.350 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుంద‌ని తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో క‌రోనా టెస్టులు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 1080 బెడ్లు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. అద‌నంగా 300 అక్సిజ‌న్ బెడ్ల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. నాన్ కోవిడ్ కేర్‌, కోవిడ్ కేర్ ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. జిల్లాలో కొత్త‌గా 1000 మందిని కొత్త‌గా వైద్య‌శాఖ‌లో నియ‌మిస్తున్నామ‌ని వివ‌రించారు. ప్లాస్మా దానం చేసే వారికి ప్ర‌భుత్వం రూ.5 వేల ప్రోత్సాహ‌కం అందిస్తుంద‌ని వెల్ల‌డించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top