జగనన్నకు అండగా ఉందాం

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
 

విజయవాడ:  మహిళా సంక్షేమానికి, సాధికారతకు విశేష కృషి చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మహిళలంతా అండగా నిలవాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. విజయవాడలోని మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేస్తూ చట్టం చేసిన రాష్ట్రం ఏపీనే.  ఈ రోజు రాష్ట్రంలో ఓ మహిళా డిప్యూటీ సీఎంగా, హోం మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మహిళలకు అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం వైయస్‌ జగనే.  ఓ మహిళా శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారంటే, ఓ మహిళా సీఎస్‌గా పని చేసి ఇవాళ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారంటే అది వైయస్‌ జగన్‌ ఘనతే. నా నియోజకవర్గంలో నాకు ఓట్లు వేసిన ఓటర్లకు నా ముఖం కూడా తెలియదు. అలాంటి నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. మన రాష్ట్రంలో మహిళలకు ఇన్ని పదవులు, పథకాలు ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరు. మా మహిళలకు విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు, సొంతింటి కలను నిజం చేసిన నాయకుడు వైయస్‌ జగన్‌. ఆ రోజు పాదయాత్ర చేసిన కష్టం మీదైతే..పథకాలతో సంతోషంగా ఉన్నది మేము. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు, అక్క చెల్లెమ్మలకు నాదో పిలుపు. మన కోసం ఇంతగా తహతహలాడుతున్న అన్నకు అండగా, తోడుగా ఉందాం. కుట్రలు, కుత్రాంతలకు ఎదురు నిలుద్దామని పుష్పాశ్రీవాణి పిలుపునిచ్చారు. 

 

Back to Top