జీసీసీలో అవినీతిపై విచారణకు ఆదేశం

అమరావతి: గిరిజనుల ఉత్పత్తులకు ధర కల్పించకుండా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. జీసీసీలో గత ఐదేళ్లలో వందల కోట్ల రూపాయల అవినీతిపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విచారణకు ఆదేశించారు. గత నాలుగేళ్లుగా ఆడిట్‌ జరగకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జీసీసీ కేంద్రాల్లో సరుకుల కొనుగోళ్ల అవినీతిపై విచారణ చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌లో జరిగిన గోల్‌మాల్‌పై కూడా ఆరా తీయాలన్నారు. అవినీతిలో భాగస్వాములైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top