ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
 

 

అనంతపురం: అర్హులైన పేదలందరికీ ఇళ్లు, స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ఉగాదికి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అనంతపురంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మీడియాతో మాట్లాడుతూ.. అస్తవ్యస్థంగా ఉన్న భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని అధికారులకు సూచించారు. ఆక్రమణలో ఉన్న భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. పెండింగ్‌ కేసులన్నీ వెంటనే పరిష్కరించాలన్నారు. భూ ఆక్రమణ దారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top