మద్యపాన నిషేధంపై సీఎం గట్టి నిర్ణయం తీసుకున్నారు

డిప్యూటీ సీఎం నారాయణస్వామి

విదేశీ మద్య నియంత్రణ బిల్లుపై చర్చ

మద్యపానం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి

మద్యాన్ని నిషేధించాలని మహిళలు పాదయాత్రలో మొరపెట్టుకున్నారు

అమరావతి: మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. విదేశీ మద్య నియంత్రణ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. మద్యపానం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.  దేవుడిని నమ్ముకున్న వారంతా కూడా వైయస్‌ జగన్‌ దేవుడు అని నమ్మకం పెట్టుకున్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు వైయస్‌జగన్‌ ఓదార్పు యాత్ర చేశారు. ప్రతి పేదవాడి గడపను తొక్కారు. పాదయాత్రలో అన్ని వర్గాల సమస్యలు తెలుసుకున్నారు. మద్యాన్ని నిషేధించాలని మహిళలు పాదయాత్రలో మొరపెట్టుకున్నారని చెప్పారు. వారి కన్నీటి గాధలు విన్న వైయస్‌ జగన్‌ మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మద్యపాన నిషేదంతో అన్ని కుటుంబాల్లో సమానత్వం, ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందని వైయస్‌ జగన్‌ నమ్మారు. అందుకే దశల వారీగా మద్యపాన నిషేదం చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సమాజంలో అందరూ బాగుపడాలంటే మద్యపాన నిషేదం తప్పనిసరి చేయాలని భావిస్తున్నాం. ఆడపడుచులు సుఖసంతోషాలతో ఉంటారో ఆ ఇళ్లు ఆనందంతో ఉంటుంది. మద్యపాన నిషేధంపై సీఎం వైయస్‌ జగన్‌ గట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మంత్రి వర్గంలో సగానికి పైగా బీసీలు, ఎస్సీలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న వైయస్‌ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అండగా ఉంటారని చెప్పారు. 20 ఏళ్లు వైయస్‌ జగన్‌ సీఎంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద కుటుంబానికి చెందిన తనను రాజకీయంగా వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రోత్సహించారని, వైయస్‌ జగన్‌ ఉప ముఖ్యమంత్రిని చేశారన్నారు. రాజకీయ సమానత్వం అవసరమన్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top