మద్యం సరఫరా చేయాలన్నదే టీడీపీ ఉద్దేశమా?  

టీడీపీకి డిప్యూటీ సీఎం నారాయణస్వామి సూటి ప్రశ్న

దశలవారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తాం

తాగు, తాగించు అన్నది చంద్రబాబు నైజం

మద్య నిషేదంపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు 

డిప్యూటీ సీఎం నారాయణస్వామి

 

అసెంబ్లీ: మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే టీడీపీ నేతలకు కడుపు మండుతోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేదానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. మద్యపానం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. ఎన్టీ రామారావు మద్యపాన నిషేదాన్ని పూర్తిగా అమలు చేసే సమయంలో చంద్రబాబు ఓట్ల కోసం..ఎందుకంటే ఎన్టీఆర్‌ ఏమి చెప్పారో మేనిఫెస్టోలో పెడుతున్నానని, మద్యపాన నిషేదం చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయనను నమ్మి ఓట్లు వేసిన వారికి ద్రోహం చేశారు. మద్యం పాలసీ తెచ్చి మందు తాగు..తాగించు అన్న పాలసీతో ముందుకు వెళ్లారు. మహిళల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన మా జననేత వైయస్‌ జగన్‌ మహిళలకు ఇచ్చిన కానుక..మద్యం మాన్పించు..అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నారు. బాగా బాటిల్స్‌ సఫ్లయ్‌ చేయాలా? మీ ఆలోచన ఏంటి?. గతంలో మద్యం ఏరులు పారింది. ప్రైవేట్‌ వ్యాపారులు ఇష్టరాజ్యాంగా దోచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 48.33 శాతం, మే నెలలో 4.15, జూన్‌లో 9.12 శాతం, జులైలో 20.40, ఆగస్టులో మైనస్‌ 2.5 శాతం అంటే తాగేవాళ్లు తగ్గుతూ వచ్చారు. టీడీపీ నేతల కడుపు మంట ఏంటో అర్థం కావడం లేదు. టీడీపీ నేతలకు సూటీగా ప్రశ్నిస్తున్నాను..మద్యపానాన్ని అమలు చేయాలా? వద్దా సమాధానం చెప్పమనండి. మద్యపానం దశలవారీగా నిషేదిస్తున్నాం. ఇప్పటికీ 20 శాతం షాపులు తగ్గించాం. గతంలో 4380 షాపులు ఉండగా దాన్ని తగ్గిస్తూ 3420 షాపులు మాత్రమే ఏర్పాటు చేశాం. రెంట్లు అంటున్నారు. ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో రూములు రెంట్లు తీసుకునే చర్యలు తీసుకున్నాం. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక మద్యపాన నిషేదాన్ని దశల వారిగా అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. వైయస్ఆర్ సీపీ నేతలెవరూ మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు.   విశాఖలో టీడీపీ సపోర్టర్‌ వద్ద అద్దెకు తీసుకున్న షాపు వివరాలు ఉన్నాయి. జనప్రియ షాపు యజమాన్యం ముందుకు రావడంతో టీడీపీ నేతలకే అప్పగించాం. టీడీపీ వాళ్లు కూడా ముందుకు రాకపోయి ఉంటే 70 శాతం మద్యపాన నిషేదం అమలు అయ్యేది. ఒకేసారి మద్యపానం నిషేదం చేయడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో దశలవారిగా అమలు చేస్తున్నాం. గతంలో అన్ని కూడా టీడీపీ మద్దతుదారులకే మద్యం షాపులు ఇచ్చారు. ఎవరు దరఖాస్తు చేసుకున్నా టెండర్‌ ద్వారా ఇస్తామని ఆ రోజు ప్రకటించాం. వైయస్‌ఆర్‌సీపీ నేతలెవరూ కూడా టెండర్‌ వేసేందుకు ముందుకు రాలేదు. రాష్ట్రంలో 80 శాతం షాపులు టీడీపీ నేతలవే ఉన్నాయి. షాపుల అద్దెలపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తాం. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గతంలో షాపులు నిర్వహించారు. మేం అధికారంలోకి వచ్చాక ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలకే షాపులు మూసివేస్తున్నామన్నారు. దేవుడి స్వరూపంలో వచ్చిన వ్యక్తి వైయస్‌ జగన్‌. వచ్చే నాలుగేళ్లలో పూర్తిగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తాం. ముఖ్యమంత్రి మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తున్నారని, టీడీపీకి ప్రజా కోర్టులో శిక్ష విధించారు. మద్యపాన నిషేదాన్ని అడ్డుకుంటే రేపు మహిళలే తగిన గుణపాఠం చెబుతారు. 
 

Back to Top