శ్రీకాకుళం: గ్రూపు రాజకీయాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ప్రజాప్రతినిధులకు అభినందన సభ కేంద్ర మాజీ మంత్రి,పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మాన మాట్లాడారు. స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికల్లో తొలిసారి జిల్లా చరిత్రను చరిత్ర తిరగరాశామన్నారు. అధికారం వచ్చిందని గొప్పలు పోవద్దు ఎంతో మంది త్యాగం చేస్తే మనకు ఈ అవకాశం దక్కిందని భావించాలన్నారు. అందరినీ కలుపుకొని వెళ్ళండి. పార్టీ మాత్రమే గొప్ప... వ్యక్తులు కాదు అనే విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. సమష్టిగా, సంఘటితంగా ఉంటే గొప్ప ఫలితాలు వస్తాయనడానికి మొన్నటి ఫలితాలే నిదర్శనమని గుర్తు చేశారు. సీఎం వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే మన తొలి ప్రాధాన్యతగా ఉండాలన్నారు. కార్యకర్తలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చే పార్టీ వైయస్ఆర్ పార్టీ మనవాళ్ళే కొందరు దుస్ప్రచారం చేస్తున్నారు అది మానుకోండని హితవు పలికారు. అతి విశ్వాసం వొద్దు నిర్లక్ష్యంతో ఓటమి తప్పదు ఎన్ని కష్టాలు ఉన్నా కలసి మాట్లాడుకోవాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలో 10/ 10 అసెంబ్లీ, పార్లమెంటు స్థానం కచ్చితంగా గెలిచి తీరుతామన్నారు. అసంతృప్తితో ఉన్న వారి ఇళ్లకు అధిష్టానం, జిల్లా నాయకత్వం స్వయంగా వెళ్లి అందరికీ అండగా ఉంటుందన్నారు. అభినందన సభలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయా సాయిరాజ్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ డి సి సి బి చైర్మన్ పాలవలస విక్రాంత్ పలువురు కార్పొరేషన్ చైర్పర్సన్ లు పాల్గొన్నారు.