ముస్లింల అభివృద్ధికి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కృషి

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

అమ‌రావ‌తి: ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా కొనియాడారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. గురువారం ఆయ‌న స‌భ‌లో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముస్లిం మైనార్టీలకు ఉన్నత చదువులు చదివే అవకాశం లభించిందన్నారు. అన్ని వర్గాల కన్నా మైనార్టీలు వెనుకబడి ఉన్నారన్నారు. వైయ‌స్సార్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు దగా చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్‌ ఆసరాతో లక్షా 68 వేల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం కలిగింది. వైయ‌స్సార్‌ చేయూత ద్వారా 2.46 లక్షల మంది మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు.

వక్ఫ్‌ ఆస్తులను కంప్యూటరీకరణ చేయడం జరిగింది. వక్ఫ్‌ బోర్డు బకాయిలు చెల్లించడం జరిగింది. అగ్రిగోల్డ్‌ బాధితుల్లో 43, 680 మైనార్టీలు ఉన్నారు. ప్రైవేటు కంపెనీ బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం ఆదుకుంది. 20 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి రూ.38 కోట్లు ప్రభుత్వం అందించిందని అంజాద్‌బాషా అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top