గౌతంరెడ్డిపై ఉన్న అభిమానం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గెలిపిస్తుంది

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా
 

నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డిపై ఉన్న అభిమానం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి గెలుస్తారని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ధీమా వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో అభివృద్ధి, సంక్షేమమే అజెండా అన్నారు. మూడేళ్ల సుపరిపాలనకు వందశాతం ప్రజామోదం లభించిందన్నారు. బద్వేల్, తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల కంటే మిన్నగా ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షకు పైగా మెజారిటీతో వైయస్‌ఆర్‌సీపీ ఆత్మకూరులో గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఇక్కడ పోటీ చేసే అర్హత లేదని, ఆ పార్టీకి ఆత్మకూరులో భంగపాటు తప్పదని హెచ్చరించారు.
 

Back to Top