సహజ మరణాలపై కూడా అపోహాలు సృష్టిస్తున్నారు

జంగారెడ్డిగూడెం ఘటనపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటన 

మద్యం తాగలేని స్వయంగా మృతుడి భార్య చెప్పింది

మొదటి దశలో 16 మందిలో 15 మంది ఇంటి వద్దే చనిపోయారు

టీడీపీ నేతలే ఈ మరణాలను వక్రీకరిస్తున్నారు

ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకోవాలి

అమరావతి: జంగారెడ్డిగూడెంలో జరగని మరణాలపై టీడీపీ, ఎల్లోమీడియా అసత్య ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఇలాంటి పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమన్నారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తూ లేని సమస్యను పెద్దదిగా సృష్టిస్తోందని మండిపడ్డారు. నలుగురు చనిపోతే 18 మంది మృతి చెందినట్లు టీడీపీ అపోహాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. అభూత కల్పనతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ఘటనపై సోమవారం మంత్రి ఆళ్లనాని ప్రకటన చేశారు. టీడీపీ అసత్య ప్రచారంతో రాష్ట్ర ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఆలోచన చేస్తున్నారు. ప్రజలకు  వాస్తవాలు తెలియాలి. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియాలి.  సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మేమంతా కూడా జంగారెడ్డి గూడెనికి వెళ్లాం. ఆ ప్రాంతంలో అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకున్నాం. సభ ద్వారా ప్రజలకు వివరించాలని ముందుకు వచ్చాను. జంగారెడ్డిగూడెంలో జరగని అంశాలను, సహజ మరణాలను కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు శవ రాజకీయాలకు టీడీపీ నేతలు అండగా నిలిచారు. అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆలోచన వీరికి లేదు. సలహాలు ఇవ్వాలన్న ఆలోచన టీడీపీ నేతలకు లేదు. జంగారెడ్డిగూడెంలో అలాంటి పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణం. చంద్రబాబు అధికార దాహంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి  జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబుకు అధికారం దక్కదనే భయంతో కుట్రలకు తెరతీశారు. చంద్రబాబు ఎంతగా అడ్డుపడినా అభివృద్ధి, సంక్షేమం ఆగడం లేదు. చంద్రబాబు రాకముందే ఆ ప్రాంతానికి వెళ్లి లేని సమస్యను ఇంకా పెద్దదిగా చేస్తున్నారు. అక్కడి మరణాలు వాస్తవంగా నలుగురు వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. వాటిని వార్త పత్రికలు 18 మరణాలు జరిగాయని అపోహాలు కలిగించేలా ప్రచురించారు. అభూత కల్పనలతో ప్రజల్లో అపోహాలు కల్పిస్తున్నారు. వైయస్‌ జగన్‌పై బురద జల్లే కార్యక్రమాలకు వాళ్లు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు అధికారం కోసం ఎంత నీచానికైనా వెనుకాడడు. ఈనాడు వంటి ఓ పత్రిక కూడా లేనిపోని అవాస్తవాలతో శవరాజకీయాలకు కుటిల యత్నాలు చేస్తూ చంద్రబాబుకు వంత పాడుతోంది. వాస్తవాలు పత్రికలు ప్రచురించాలి. అది వారిహక్కు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని అపోహగా చూపిస్తున్నారు. ఈనాడులో ఉపేంద్ర భార్య రోదిస్తున్నట్లు రాశారు. ఉపేంద్ర 12వ తేదీన ఆసుపత్రిలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వచ్చారు.  కుటుంబ సభ్యులు ఉపేంద్రకు ఛాతిలో నొప్పి వస్తుందని చెబితే డాక్టర్లు ఈసీజీ తీశారు.గుండె నొప్పితో చనిపోయారని ఈసీజీ రిపోర్టు చెబుతోంది. డాక్టర్లు ధ్రువీకరించిన తరువాత భార్య కూడా స్టేట్‌మెంట్‌ఇచ్చింది. ఐదు రోజులుగా తన భర్త మద్యం తాగలేదని ఉపేంద్ర భార్యనే చెప్పింది. ఈనాడులో దారుణంగా అవాస్తవాలను ప్రచురించింది. టీడీపీ కుట్రలకు ఈనాడు వంత పాడుతోంది.
 అక్కడి పరిస్థితులు ఆలోచన చేస్తే..18 మంది చనిపోయారని టీడీపీకి మద్దతు ఇస్తున్న పత్రికల్లో రాశాయి. 18 మంది చనిపోయింది ఒక్క రోజులో..ఒక్క కారణంతో చనిపోలేదు. వారం రోజుల్లో చనిపోయారు. మొదటి దశలో 16 మంది చనిపోయారు. వారు ఇంటి వద్దే చనిపోయారు. అప్పుడు వార్త కథనాలు రాలేదే? ఆ తరువాత శ్మశానం వద్దకు టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ప్రతినిధులు వెళ్లి తప్పుడు ప్రచారానికి తెర తీశారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top