కరోనా నివారణ చర్యల్లో ఏపీ ఆదర్శం

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాం

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్స్‌ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గంటల దీక్షతో చంద్రబాబు సాధించింది ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే బాబు పరిమితమయ్యారని విమర్శించారు. కరోనా నివారణ చర్యలపై ప్రధాని ప్రశంసలు మీకు కనిపించవా అంటూ నిలదీశారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబులా వైయస్‌ జన్‌ తప్పుడు దీక్షలు చేయలేదన్నారు. కరోనా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌ మాత్రం జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మూడో దశ కరోనాపై ఇప్పటికే సీఎం వైయస్‌ జగన్‌ మమ్మల్ని సన్నధ్ధం చేశారని చెప్పారు. అందరికీ రక్షణ కల్పించి, తగు చికిత్సలు అందించాలని ఆదేశించారన్నారు. కరోనా ఎన్ని వేవ్‌ల్లో వచ్చినా కూడా సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.  చంద్రబాబు చేసిన కుట్ర పూరిత వ్యాఖ్యలను, మోసపూరిత మాటలను ఎవరూ కూడా నమ్మొద్దని మంత్రి ఆళ్ల నాని కోరారు. 
చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ..శవరాజకీయాలు చేస్తున్నారు. బాధ్యత గల పత్రికాధినేత రాధాకృష్ణ తన వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను ఏదో విధంగా ప్రజలను చులకన చేసేందుకు, ఆయన్ను గద్ద దించి చంద్రబాబును సీఎం చేయాలని ఆలోచనతో రాతలు రాస్తున్నారు.
దారుణమైన అవాస్తవాలు, నీచమైన రాతలు రాధాకృష్ణ రాస్తున్నారు. పత్రిక విలువలు కాపాడటం మరిచి పాత్రికేయ విలువలను మంట గలుపుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత ధ్వేషంతో రాతలు రాస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి రోజు జీసస్‌తో మాట్లాడుతున్నానని, తాను దేవదూతను, అర్థరాత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డితో మాట్లాడుతున్నానని ఓ అధికారి రాధాకృష్ణకు చెప్పినట్లు పచ్చి అబద్ధాలతో కథనాలు రాశారు. కరోనా ప్రారంభం నుంచి ప్రతి రోజు జరిగే సీఎం సమీక్షా సమావేశంలో ఎంతో మంది అధికారులు, మంత్రులు పాల్గొంటారు. ఇలాంటి వ్యాఖ్యలు సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పుడు అనలేదు. ఈ విధంగా రాయడం బాధాకరం. వ్యక్తిగతంగా వైయస్‌ జగన్‌పై బురద జల్లాలని వ్యక్తిగత ఎజెండాతో కుట్రలు చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top