ఫోన్ చేసిన 15 నిమిషాల్లో అంబులెన్స్‌

 ప్ర‌తి మండ‌లానికి ఒక కొత్త అంబులెన్స్‌

రేపు 1068 కొత్త వాహ‌నాలు ప్రారంభం

వైయ‌స్ఆర్ మ‌ర‌ణం త‌రువాత అంబులెన్స్‌ల నిర్వాహ‌ణ‌పై నిర్ల‌క్ష్యం 

అంబులెన్స్‌లు రాక ఎంద‌రో ప్రాణాలు కోల్పోయారు

ప్ర‌జా ఆరోగ్యంలో రేపు సువ‌ర్ణాధ్యాయం

 డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

విజ‌య‌వాడ‌:  ఫోన్ చేసిన 15 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉంటుంద‌ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు ప్ర‌భుత్వం అంబులెన్స్‌లు అధునాత‌న ప‌ద్ధ‌తిలో రూపొందించామ‌ని, రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా 1068 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభిస్తార‌ని, ప్ర‌జా ఆరోగ్యంలో రేపు సువ‌ర్ణ అధ్యాయం కాబోతుంద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. 

వైయ‌స్ఆర్ మ‌ర‌ణం త‌రువాత ప‌ట్టించుకునే నాథుడు లేడు..
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు 108, 104 వాహ‌నాల‌ను అందుబాటులోకి తెచ్చార‌న్నారు.  ఎన్నో ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడార‌ని తెలిపారు. వైయ‌స్ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత అవ‌న్నీ నిర్ల‌క్ష్యానికి గుర‌యాయ్నారు. అంబులెన్స్‌లు రాక  ఎంద‌రో ప్రాణాలు కోల్పోయార‌న్నారు. ఈ వాహ‌నాల‌కు చిన్న‌పాటి మ‌ర‌మ్మ‌తులు కూడా గ‌తంలో చంద్ర‌బాబు చేయించ‌కుండా వ‌దిలేశార‌న్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల మీద ఎలాంటి బాధ్య‌త లేకుండా, జాలీ లేకుండా గ‌తంలో చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించారు. 108 వాహ‌నాల‌కు క‌నీస సౌక‌ర్యాలు కూడా చంద్ర‌బాబు క‌ల్పించ‌లేక‌పోయార‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో చెట్ల కింద నిరుప‌యోగంగా ఉన్న ప‌రిస్థితి చూశామ‌న్నారు.

ప్ర‌తి మండ‌లానికి ఒక కొత్త అంబులెన్స్‌
ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తి మండ‌లానికి ఒక కొత్త అంబులెన్స్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి నాని పేర్కొన్నారు.  ప్ర‌తి మండ‌లానికి ఒక 104, 108 వాహ‌నాన్ని కేటాయించార‌ని తెలిపారు.
ప్ర‌తి గ్రామీణ ప్రాంతానికి, ఏజెన్సీ ప్రాంతాని ఈ సేవ‌లు అందిస్తున్నామ‌న్నారు. 108 వాహ‌నాలు సుమారుగా 676 మండ‌లాల‌కు గతంలో కేటాయించ‌గా, కొత్త‌గా  474 కొత్త‌గా కొనుగోలు చేశామ‌న్నారు. రేపు 1068 కొత్త వాహ‌నాల‌ను సీఎం ప్రారంభిస్తార‌న్నారు. రూర‌ల్ ఏరియాలో ఫోన్ చేసిన 20 నిమిషాల్లో 108 వాహ‌నం అందుబాటులో ఉంటుంద‌న్నారు. అర్బ‌న్ ఏరియాలో 15 నిమిషాల్లో అందుబాటులో ఉంటుంద‌న్నారు. ప్ర‌త్యేక స‌మ‌యాన్ని కేటాయించామ‌న్నారు. 108 వాహ‌నాలు మూడు ర‌కాలుగా ప్ర‌వేశ‌పెడుతున్నామ‌న్నారు. అడ్వాన్స్‌డ్‌లైవ్ స‌పోర్టు వాహ‌నాలు 104, బెసిక్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 274,  శిశు మ‌ర‌ణాలు త‌గ్గించేందుకు జిల్లాకు రెండు చొప్పున ప్ర‌వేశ‌పెడుతున్నామ‌న్నారు. ఇంత‌కు ముందు 1.20 ల‌క్ష‌ల మంది జ‌నాభాకు ఒక 108 వాహ‌నం ఉండేది. ఇప్పుడు 74 వేల జ‌నాభాకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. ‌తంలో 80 వేల‌కు ఒక 104 వాహ‌నం ఉంటే ఇప్పుడు 40 వేల మందికి ఒక వాహ‌నం ఏర్పాటు చేశామ‌న్నారు.లైఫ్ రిస్క్ నుంచి కాపాడేందుకు 100 అంబులెన్స్‌లు సిద్ధం చేశామ‌న్నారు.  104 వాహ‌నంలో గ‌తంలో కొన్ని ర‌కాల టెస్టులు మాత్ర‌మే చేసేవార‌న్నారు. ఇప్పుడు 72 ర‌కాల మందులు ఇవ్వ‌బోతున్నామ‌ని చెప్పారు. 

Back to Top