ఆరోగ్యశ్రీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు

గతంలో ఆరోగ్యశ్రీ నిధులను పక్కదోవ పట్టించారు

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వ హయాంలో పర్యవేక్షణ కరువై వైద్య ఆరోగ్య శాఖ దిగజారిపోయిందన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నిధులను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించింది. గత పాలనలో చివరి ఆరు నెలలు చంద్రబాబే వైద్య,ఆరోగ్య శాఖను పర్యవేక్షించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల వైద్య ఆరోగ్య శాఖ దిగజారిపోయింది. వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధిపై టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీలో పెనుమార్పులు చేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో 117 వ్యాధులకు మాత్రమే, ఇవాళ వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక 1059 ఉన్న వ్యాధులను 2 వేలకు పైగా పెంచింది వాస్తవం కాదా? గత ప్రభుత్వాలు అన్ని కూడా ఆపరేషన్లకు డబ్బులు ఇచ్చామని వదిలేసింది. మా ప్రభుత్వం ఆపరేషన్లతో పాటు విశ్రాంతి సమయంలో కూడా డబ్బులు ఇస్తూ తోడుగా ఉంటుంది. మా ప్రభుత్వం రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించింది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వాన్నంగా ఉండేవి..మా ప్రభుత్వం వచ్చాక నాడు-నేడు కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చబోతున్నాం. వైద్య రంగం పునర్నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు సంతకం చేసిన ఎన్నో చెక్కులు కూడా బౌన్స్‌ అయ్యాయి. కిడ్నీ పేషంట్లకు సమస్యలు వస్తే గతంలో పట్టించుకోలేదు. మా ప్రభుత్వం రూ.10 వేలు, రూ.5 వేల కేటగిరిలలో మానవత్వంతో అందిస్తున్నాం. పేదల ఆరోగ్యానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీర్వాదాలు పెరుగుతాయని టీడీపీ అడ్డుపడుతోంది. మా ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంది. మెడాల్‌ సంస్థ టీడీపీ హయాంలో నియమించబడింది. కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. సీఎం అనుమతి మేరకు విజిలెన్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం.
 

Back to Top