ప్రభుత్వం ఖర్చులు పెట్టడం వల్లే ఎకానమీ పెరిగింది

ఫైనాన్స్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ స్పెషల్‌ సెక్రటరీ దువ్వూరి కృష్ణ
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

టీడీపీ హయాంలో అప్పులు బాగా పెరిగాయి

విద్య, వైద్య రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది

కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టడం వల్లే ఎకానమీ పెరిగిందని ఫైనాన్స్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ స్పెషల్‌ సెక్రటరీ దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. అవినీతి చేసేందుకు అప్పులు చేయలేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచే అర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొందరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం సర్వసాధారణమన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు సరిగ్గా వినియోగించి ఉంటే ఇప్పుడు ఆర్థికభారం వచ్చేది కాదన్నారు. కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. బుధవారం విజయవాడలో దువ్వూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. 

పవర్‌ సెక్టార్‌లో 2014 మార్చిలో మేజర్‌ కార్పొరేషన్లు ఉండేవి. ఆ రోజు ఈ కార్పొరేషన్ల అప్పులు రూ.33587 కోట్లు, అది కాస్త రూ.70 వేల కోట్లు ఐదేళ్లలో అయ్యింది. ఇందులో రూ.2800 కోట్లు బకాయిలు ఉండేవి. అది కాస్తా రూ.21 వేల కోట్లకు చేరింది. ఈ రోజు పవర్‌ సెక్టార్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 60 వేల మిలియన్‌ యూనిట్లు(దాదాపుగా 6 వేల కోట్ల మిలియన్‌ యూనిట్లు) ప్రతి ఏటా మనం సప్లై చేస్తాం. అప్పులపై వడ్డీలు రూ.7 వేల కోట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్‌పై రూ.1.20 అప్పు కోసం భరిస్తున్నాం. జరిగిన అప్పులపై ఆలోచన చేస్తే..కేంద్ర అప్పులు ఎంత పెరిగిందో ఆలోచన చేస్తే..రాష్ట్ర  అప్పు 2014–2019 మధ్యలో  17.33 శాతం కాంపొనెంట్‌ అన్యువల్‌ గ్రేత్‌రేట్‌ ఉంటే ..దేశంలో 9.78 శాతం ఉంది. అప్పట్లో అప్పు చేయడం వల్ల ఏదైనా అభివృద్ధి జరిగిందా?. ఆ రోజు ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేశారు. రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అప్పు భారం 77 శాతం ఉంది. విద్యా రంగంలో అందరికీ ఉచిత విద్య ఇవ్వాలి. రాష్ట్రంలో 2016–2017లో 84 శాతం మాత్రమే పిల్లలు బడికి వెళ్లారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహించకుండా ప్రైవేట్‌ రంగాన్ని చంద్రబాబు ప్రోత్సహించారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా నిర్మించలేదు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 

ఈ రోజు ఈనాడు పేపర్‌ గమనిస్తే 2020–2021వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూ.4 వేల కోట్లు అప్పు చేసినట్లుగా రాశారు. ఇటువంటి ప్రక్రియ గతంలో ఎప్పుడు జరగనట్లు, ఈ ప్రభుత్వమే కొత్తగా అప్పులు చేసినట్లు, రాష్ట్రంపై అప్పుల భారం పెరిగినట్లు ఈనాడు కథకం ఉంది.  
రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేయాలన్నది ఆర్థిక శాఖ నిర్దేశిస్తుంది. ఫైనాన్స్‌ కమిషన్‌ రెకమొండేషన్‌ ప్రకారం ఆర్థిక శాఖ నిర్ణయిస్తుంది. ఆ సంవత్సరం ఎంత అప్పు తీర్చాలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పులు ఇంత వరకు తీసుకోవచ్చు అని డిసైడ్‌ చేస్తారు.  టీడీపీ హయాంలో2016– 17, 17–18,18–2019లో ఫైనాన్స్‌ కమిషన్‌ సూచించిన అప్పు కంటే అధికంగా రూ.16,418 కోట్లు అప్పు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్ల భారం తగ్గిస్తామని లెటర్‌ ఇస్తే..ఇందులో టీడీపీ హయాంలో జరిగిన అధిక అప్పులే కారణం. 

విభజన సమయంలో రూ.8 వేల కోట్లు అప్పులపై వడ్డీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చే సరికి రూ.25 వేల కోట్లకు చేరింది. కోవిడ్‌ అన్నది ఎవరూ ఊహించని సంక్షోభం. 2020, 2021లో దేశం మొత్తం ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. రెండు దశాబ్ధాల తరువాత మొదటిసారి మైనస్‌ 3.38 శాతం గ్రాస్‌ ట్యాక్స్‌ రెవెన్యూ గ్రోత్‌ రేట్‌ వచ్చింది. 2019లోనే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే..కరోనా వచ్చింది. ఈ సమయంలో రెవెన్యూ పడిపోయింది. ఖర్చులు పెరిగాయి. విపత్తు సమయంలో ప్రజల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకే ప్రభుత్వం అప్పులు చేసి ఎకానమీని నిలబెట్టారు. మా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు డబ్బు అందజేసింది. ఎన్ని కష్టాలు ఉన్నా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నారు. 

సెంట్రల్‌ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం 3 శాతం నియంత్రణ ఉంటే..రూ.21 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం చూస్తే జీడీపీలో ఇది 11వ శాతం అవుతుంది. ప్రభుత్వ చర్యల వల్లే కోవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడ్డామని చెప్పారు. ప్రభుత్వం ఖర్చులు పెట్టడం వల్లే ఎకానమీ పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అవినీతి చేసేందుకు కాదని, ప్రజలను ఆదుకునేందుకే అప్పులు చేయాల్సి వచ్చిందని, ప్రజల జీవనం కోసం అప్పులు చేశామని దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top