రేపు వైయస్‌ఆర్‌సీపీలోకి దగ్గుపాటి చేరిక

చంద్రబాబు  ఒక వింత జీవి..

ఐదేళ్లు కాలయాపన చేసి..ఎన్నికల ముందు కొత్త వరాలా..

చంద్రబాబుపై దుగ్గుపాటి వెంకటేశ్వరరావు ధ్వజం..

మాట తప్పని..మడమ తిప్పని నేత వైయస్‌ జగన్‌

వైయస్‌ జగన్‌ పథకాలు చంద్రబాబు కాపీ కొడుతున్నారు

విజయవాడ: రేపు తాడేపల్లిలో వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నట్లు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కుటుంబంలో  తల్లితండ్రులు రాజకీయాల్లో ఉన్నప్పుడు వారి పిల్లలపై ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుందన్నారు.రాజకీయ రంగం అనేది బాధ్యత  అని తన కుమారుడికి దిశా నిర్దేశం చేసిన తర్వాతే రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశ్వాసం చూరగొన్నారని తెలిపారు.

వైయస్‌ జగన్‌ రూపొందించిన పథకాలనే చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. రైతుల రుణమాఫీ చేయకుండా..ఎన్నికల ముందు కొత్త పథకాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.ఆరు వేల కోట్ల రూపాయల వడ్డీ రాయితీ డ్వాక్రా మహిళలకు ఇవ్వకుండా నేడు పోస్ట్‌డేటేడ్‌ చెక్కులు ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ నిధులు 35వేల కోట్లు నుంచి 40వేల కోట్లుతో వేసిన రోడ్లు,నిర్మాణాలు చేసి తిరిగి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెతి పోస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రోజుకో మాట,పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబును ఒక వింత జీవిగా అభివర్ణించారు. రుణమాఫీ చేయకుండా చంద్రబాబు వరాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు పోలవరం మీద ఉద్యమాన్ని చంద్రబాబు సహించలేదని, ఇప్పుడు పోలవరాన్ని అన్నీ నేనే అన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు.

వైయస్‌ జగన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది: హితేజ్‌..

సమాజమే దేవాలయం..ప్రజలే నా దేవుళ్లు అనే నినాదంతో తాత ఎన్టీఆర్,  తల్లిదండ్రుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావడం జరిగిందని దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేజ్‌ చెంచురామ్‌ అన్నారు. 30 సంవత్సరాల రాజకీయాల్లోకి ఉన్నప్పుటికి మా కుటుంబం మీద ఒక మచ్చ కూడా లేదన్నారు. ఆ దిశలో రాజకీయాల్లో కొనసాగుతానని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలిసి పనిచేయడానికి చాలా ఆనందంగా ఉంది.ప్రజల కోసం వైయస్‌ జగన్‌ చాలా కష్టపడుతున్నారన్నారు.రాష్ట్రంలో ప్రతివర్గానికి మేలు చేసేవిధంగా అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద శాతం ప్రజలకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామన్నారు.ప్రజా సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ సీఎం కావడానికి కృషిచేస్తామని తెలిపారు.

Back to Top