దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో విజ‌య‌వంతం

3 ఎంవోయూలు కుదుర్చుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న  "దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షోష విజ‌య‌వంత‌మైంది. ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి నేతృత్వంలోని అధికారుల బృందం  దుబాయ్ పర్యటనలో సోమవారం 3 ఎంవోయూలను కుదుర్చుకుంది. రెండు జీ2బీ, ఒక బీ2బీ అవగాహన ఒప్పందాలపై సంత‌కాలు చేశారు. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఒప్పందం జ‌రిగింది. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో  25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఒప్పందం కుదిరింది. రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చి ఎంవోయూ కుదుర్చుకున్న రీజెన్సీ గ్రూప్.
అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి,చిత్తూరు, నెల్లూరు, హిందూపురం ప్రాంతాలలో  పంపిణీ కేంద్రాలు, స్పైసెస్ అండ్ పల్సెస్ ప్యాకేజీ యూనిట్లను ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం జ‌రిగింది. యూఏఈ రీటైల్ సంస్థల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రీటైల్ వాణిజ్యం మరింత ముందడుగు వేసింది. విశాఖలోని "ఫ్లూయెంట్ గ్రిడ్" అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్  గ్రూప్ లో భాగమైన  ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ2బీ ఏపీ అవగాహన ఒప్పందం జ‌రిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ పేరుతో విశాఖలో కొత్తగా 300 హైఎండ్ ఐ.టీ ఉద్యోగాలిచ్చే కంపెనీతో మరో ఒప్పందం కుదిరింది. ఎస్సార్ గురేర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ బోర్డు సభ్యులు మాజీదల్ గురేర్ , ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకు చెందిన సమయ్ మంగళగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రజా రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలను తీర్చిదిద్దే పరిశ్రమను వైఎస్ ఆర్ కడప జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో  ఏర్పాటు చేయనున్న సంస్థ
ఒప్పంద పత్రాలను మార్చుకున్న ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది,  కాజస్ కంపెనీ ఎండీ రవికుమార్ పంగా. కార్య‌క్ర‌మంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, జాయింట్ డైరెక్టర్  వీఆర్ నాయక్, ఈడీబీ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top