ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ద్రోణంరాజు

అమరావతి :  వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావును విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప‍్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీఎంఆర్డీఏ చైర్మన్‌గా నియమించడంపట్ల ద్రోణంరాజు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ఆయన కలిశారు. శాలువాతో వైఎస్‌ జగన్‌ను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నగరాభివృద్ధి, పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తానని ద్రోణంరాజు అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top