రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున బిందు సేద్యం 

అవ‌స‌ర‌మైన‌ అన్నిచర్యలు తీసుకోవాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం 

అమరావతి: ఏప్రిల్ నుంచి బిందు సేద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎస్‌. ఎస్‌.శ్రీధర్, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ హరినాథ‌రెడ్డి, డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ అమలుచేసేందుకు తమ కంపెనీలు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తాయని కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రికి డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top