డాక్టర్‌ వైయస్‌ఆర్‌ టెలిమెడిసిన్‌ ప్రారంభించిన సీఎం

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైయస్‌ఆర్‌ టెలిమెడిసిన్‌ విధానాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ టెలిమెడిసిన్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. టెలిమెడిసిన్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. టెలిమెడిసిన్‌కు అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని సూచించారు. అదే విధంగా టెలిమెడిసిన్‌ కోసం 14410 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టెలిమెడిసిన్‌లో ఆరోగ్య సేవలు, ఓపీ సేవలు, ఔషదాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు పొందవచ్చు. 
 

Back to Top