వైయ‌స్ఆర్ సీపీలో చేరిన డాక్ట‌ర్ కంచ‌ర్ల అచ్యుత‌రావు

తాడేప‌ల్లి: విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన డాక్ట‌ర్ కంచ‌ర్ల అచ్యుత‌రావు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో డాక్టర్‌ కంచర్ల అచ్యుతరావు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి, ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అచ్యుతరావు, ఆరిలోవ ప్రాంతంలో స్థానికంగా మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్ వై.వీ సుబ్బారెడ్డి, వైజాగ్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Back to Top